ఆ పరమార్ధము – పరమార్థము
ప్రేరణ
కోరికలే దుఃఖమునకు కారణమా? కోరికలు పరిమితమా? లేక అపరిమితమా? దుఃఖనివారణ మానవునికి సాధ్యమేనా? అనునవి నా తొలి సందేహాలు. ప్రతి మనిషికీ జీవిత పరమార్థమును క్లుప్తముగా తెలిసికొనవలెనని ఉంటుంది. ఈ ప్రశ్నలకు నా సమాధాన సాహసమే ఈ ‘పరమార్థము’.
ప్రతి మనిషి ఆశించేది సునాయాసంగా సుఖంగా జీవించాలని, సుఖమనగా కోరికలను సాధించడం వలన మనస్సునుంచి జనించే స్పందన. కోరికలను సాధించడానికి చేసే ప్రయత్నమే వృత్తి లేదా ఉద్యోగం. ఉద్యోగం చేయడంలో జ్ఞానము, శక్తి, మనోనిగ్రహము, రక్షణ (ధర్మము, యుద్ధము)లు అత్యంత ప్రధానములు. తద్వారా గరిష్ఠ స్థాయిలో సంపదను సృష్టించాలి. త్రికాలములలో ఎవ్వరూ సాధించనంత సంపదను సృష్టించి కీర్తిమంతులవ్వాలి. అదే మోక్షము, అదే జీవిత పరమార్దము అని తెలియజేయాలని నా ప్రయత్నము.
‘పరమార్థము’ అనునది పరమ’, ‘అర్థము’ అను పదములు కలసిన సంధి. పరమ’ అను పదమునకు విశిష్టము, పవిత్రము, స్వర్గము మొదలగు అర్థములు మరియు ‘అర్థము’ పదమునకు గ్రహించు, భావము, ప్రయోజనము, సంపద, ధనము మొదలగు అర్ధములు కలవు. పరమార్థమునకు పవిత్ర లక్ష్యము, విశిషాంశము, విశిష్టసంపద అను సామాన్యార్ధములు కూడా కలవు…
‘బాలసంగ్రహము’ అనునది బాల, సంగ్రహము అను పదములు కలిసిన సమాసము. ‘బాల’ అను పదమునకు చిన్న, బాలబాలికలు అను అర్థములు కలవు. ‘సంగ్రహము’ అనగా వివరణ, మంచిని గ్రహించునది అని అర్థములు. ‘బాలసంగ్రహము’ అనగా సంక్షిప్త వివరణ, చిన్న వివరణ, బాలబాలికలు మంచిని గ్రహించునది అని అర్ధము.
విజయపథము’ అనగా విజయమునకు దారి అని, ‘పరమపదము’ అనగా ఉన్నత సానము లేదా మోక్షము లేదా స్వర్గము అని, ‘సోపానము’ అనగా మెట్టు అని అర్థము. ‘పరమపద సోపానములు” అనగా ఉన్నత స్థానమునకు లేదా మోక్షమునకు లేదా స్వర్గమునకు మెట్లు అని అర్థము.
Reviews
There are no reviews yet.