Pillala Kosam Aardhika Sastram

Rs.120.00

In stock

Author: Ranganayakamma

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం

 

పిల్లలకు సైన్స్ విషయాలు కూడా అందుతూ ఉండాలి . సైన్స్ అంటే, మనం నివసించే ప్రకృతి గురించి, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం .

 

ప్రకృతి విషయాల్లో , ప్రతి సైన్స్ ని నేర్చు కొనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతి మనిషికి క్షుణ్ణంగా అక్కరలేదు . రోజువారీగా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు . అనారోగ్యాలు మీద పడ్డప్పుడు , వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం , ప్రతి మనిషికి అక్కర లేదు . ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే .

 

కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు . మనం మనుషులం ; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి . వాటికీ ఏ శాస్త్రాలు , ఏ జ్ఞానాలు , అక్కర లేదు . కానీ , మనుషులకు , మనుషుల సంబంధాల గురించి తెలియాలి . ఆర్ధిక శాస్త్రమే , మనుషుల సంబంధాల్ని , వారి జీవిత విధానాల్ని , వివరిస్తుంది . ఈ శాస్త్రమే , నిన్నటి – ఇవ్వాల్టి – రేపటి జీవితాల్ని చూపిస్తుంది .

 

ఇది ప్రతి మనిషి కి తెలిసి ఉండాలి .

Author

Ranganayakamma

Format

Paperback