ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు, ‘వర్గాలకు – కులాలకూ’ సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య, ఒకే పరిష్కారం. కానీ, చర్చించిన కోణాలు వేరు వేరు.
ఈ పుస్తకంలోనే వున్న ఇతర వ్యాసాల్లో కొన్ని, “దెయ్యాలూ – పర లోకాలూ కూడా సైన్స్ విజ్ఞానమే” అని చెప్పే అజ్ఞాన శాస్త్రం మీద విమర్శనా వ్యాసాలు.
ఏదైనా ఒక సమస్య మీద వాదోపవాదాలు జరిగితే, అందులో హేతుబద్దమైన వాదం కనపడితే, మన వాదం తప్పుగా వున్నట్టయితే, మనం మన వాదాన్ని తప్పకుండా మార్చుకోవాలి. అది ఎదటి వాళ్ళ కోసం కాదు; మన కోసమే, మన అభివృద్ధి కోసమే…
ఈ పుస్తకంలో వున్న చిట్టచివరి వ్యాసం, మార్క్సిజాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవడానికి అవసరమైనది. ఆ అవసరం కోసమే చర్చించదగ్గది.
‘పల్లవి లేని పాట’ లో, రెండు రకాల చర్చలు వున్నాయి.
కులభేదాల గురించీ, ప్రేమ సంబంధాల గురించీ.
ఈ చర్చల్ని కూడా పరిశీలించండి!
Reviews
There are no reviews yet.