Hindu Matantara Bharatha Desam

Rs.300.00

In stock

SKU: ANVI0049-1 Category: Tag:
Author: Kancha Ilaiah

ప్రపంచ ప్రజలంతా ఎంత అభివృద్ధి కాముకులో తెలుగునాటి ప్రజలు కూడా అంతే అభివృద్ధి కాముకులు. తమ పిల్లలు ఇంగ్లీషు, సైన్సు, సమానత్వం నరనరాన జీర్ణించుకోవాలని వాళ్ళూ కోరుకుంటున్నారు. తెలుగునాటి ఉత్పత్తి ప్రజల ప్రతి సామెతలోను అభివృద్ధిని, సమానత్వాన్ని కోరుకునే తత్త్వం ఉంది. నిజానికి తెలుగునాటి ఉత్పత్తి కులాల గర్భస్థ మేధావులు తమ జీవిత అనుభూతిగా ఈ పుస్తకంలో చూసేంత, మరే రాష్ట్ర మేధావులు చూడడం సాధ్యం కాకపోవచ్చు. ఈ పుస్తకం వారి జీవిత ప్రక్రియలతో నిండి ఉంది. దేశమంతటా, మన రాష్ట్రంలో అగ్రకులస్థులు నా రచనల పట్ల ఎంతో ఆక్రోశం కలిగి ఉన్నారని నాకు తెలుసు. కులం మన శరీరానికి చర్మంలా అతుక్కొని ఉంటుంది. దాన్ని గీకినా మంట లేస్తుంది.

నేను అన్ని శరీరాల చర్మాలను గీకి రక్తాల మధ్య తేడాను చూడదల్చుకున్నాను. ఇది నాకూ ఆనందదాయకమైన పనేమీ కాదు. కాని ఆ పని ఎవరో కొందరు చెయ్యకుంటే ఈ సమాజమే చచ్చిపోతుంది. అందుకే ఇది కోపతాపాల సమస్య కాదు. ఇది మౌలిక సంఘ సంస్కరణ సమస్య. ఎన్ని కష్టాల కోర్చయినా కొంతమంది చెయ్యాలి. అగ్రకులాలవారు సైతం ఈ పుస్తకాన్ని ఆ దృష్టితో చదవాలి.

Author

Kancha Ilaiah

Format

Paperback