అభ్యుదయానికి మానవుడే కేంద్రం. అతని హేతు, శాస్త్ర, జ్ఞాన దృష్టి ఆధారంగా అణగారిన జనుల శ్రేయస్సే ధ్యేయంగా, చీకటి నుండి వెలుగుకు ప్రయాణంగా సాగే రచనల సమాహారమే అభ్యుదయ సాహిత్యంగా భావించవచ్చు. సామ్యవాద దృష్టి, సామ్రాజ్యవాద వ్యతిరేకత, శ్రామికజన పక్షపాతం, కుల మతాల ప్రతికూలత ప్రధానాంశాలుగా వెలువడేదే అభ్యుదయ సాహిత్యంగా పరిగణించి 1900 సంవత్సరం నుండి 2015 వరకు నూట పదిహేనేళ్ళుగా వెలువడిన సాహిత్య విశ్లేషణను, పరామర్శను, సమీక్షలను కాల, ప్రాంత, తత్వ చారిత్రక దిశలతో ఏర్పడ్డ సాహిత్య చతురస్రం నుండి సమీకరించి, “నూరు సంవత్సరాల సాహిత్య పరామర్శ”గా గ్రంథరూపంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తెలుగు పాఠకులకు అందిస్తోంది. ఆస్వాదించండి!
Reviews
There are no reviews yet.