జీవితంలో తగిలిన ఒక్కొక్క దెబ్బ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. తగిలిన దెబ్బలకు శరీరమే కాదు, మనసు కూడా రాటుదేలుతుంది. రాయి కన్నా కఠినంగా మారుతుంది. పగ, ప్రతీకారాలే నా ఉచ్చ్వాస నిశ్వాసాలు. పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేదీ కాదు, మనకు భగవద్గీత దక్కేదీ కాదు. నేను ఈ కథ రాసేవాడినే కాదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అనుభవాల స్వరూపం మారుతుంది. ఒకనాటి ఒప్పు నేడు తప్పుగా అనిపిస్తుంది. ఈ రాతలు మొదలు పెట్టినప్పుడు ఉన్న ఆవేశకావేశాలు కాలం గడిచిన కొద్దీ మారిపోయాయి. గెలుప్లుకన్నా ఓటమిని అంగీకరించడంలోనే ఆనందం ఉంది.
సుమారు పదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ రాతల్లో ఉన్న నిజాయితీ అప్పటికీ ఇప్పటికీ మారలేదు. కాకపోతే నిజాయితీకి ధైర్యం తోడయ్యింది. ఇవన్నీ నా జ్ఞాపకాలు. ఆత్మకథలో వాస్తవాలను వక్రీకరించే హక్కు లేదు. అభిప్రాయాలను చెప్పేటప్పుడు అలంకారాలను, అతిశయోక్తులను ఎక్కువ తక్కువలుగా చెప్పడానికి అవకాశాలున్నాయి. ఎవరైనా భుజాలు తడుముకుంటే అది వాళ్ళ ఖర్మ. ఇవి కేవలం నా అనుభవాలు మాత్రమే. ఇది నా జీవితానికి సమాధానం.
– కాట్రగడ్డ మురారి
Reviews
There are no reviews yet.