“పంచమవేదం”గా పిలువబడే భారతంలో ఎన్నో కధలు, నీతులు, ధర్మసుక్ష్మాలు…. ఎన్నో ఎన్నెన్నో కలిసి మెలిసి వున్నాయి. కధ – కధలో దుర్మార్గం, ఆవేశకావేశాలు ఎన్నో చదువుతున్న కొద్ది దర్శనమిస్తాయి.
భీష్ముల వారు, విదురుడు – దర్మస్వరూపాలుగా కనబడితే, ‘ధర్మం’ మూర్తీభవించిన ‘ధర్మరాజు’ కనిపిస్తాడు.
కృప, ద్రోణులు, అశ్వధామలు – పరిపూర్ణ బ్రాహ్మణులుగా, స్వామి భక్తి పరయాణులుగా దర్శనమిస్తారు.
ఇందులో లెక్కకు మించిన కుత్సితాలు, అన్యాయాలు, ఆక్రందనలు, అంబలు, శిఖండులు అందరు కనిపిస్తారు.
మహర్షుల దర్శనం, మహనీయుల ధర్మపధం, చెప్పే మహనీయులు, వినే జ్ఞాన – వివేకులు అన్నీ…. అందరితో…
వ్యాసుడు – ఒక ‘ధర్మ’బద్దంగా, పధంగా ఈ భారతాన్ని భారతానికి అందిస్తాడు. పంచమవేదమని ప్రకటిస్తాడు.
ఇందులో లేనిది మరెక్కడా లేదని, ఇందులో వున్నది, మరెక్కడా వుండదని లేదా కనపడదని గూడా స్పష్టంగా
చెబుతాడు.
ఇందులోమహాభారతం లోని 116 మంది వ్యక్తులు, వారి కధలు వివరించండం జరిగింది.
Reviews
There are no reviews yet.