Maha Vishnu Puranam

400.00

In stock

SKU: JP Category: Tag:
Author: adanki Venkata Lakshmi Narasimharao

    బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టుని పుత్రుడు శక్తీ. శక్తీ భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నూర్గురు సోదరులని బ్రహ్మ రాక్షసుడి చేత చంపించాడు విశ్వామిత్రుడు. 

 

తల్లి గర్భాన్నించి పుడుతూనే ‘ఓం నమో నారాయణాయ…’ నామ స్మరణతో జన్మించాడు శక్తీ కుమారుడు పరాశరుడు. పుట్టిన నాటినించి నిరంతర నారాయణ తపోదీక్షలో మునిగిపోయిన కన్నకొడుకుని చూసి ఆ తల్లి ఆవేశంతో రగిలిపోయింది. నీ  తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకో…” అంటూ కొడుకుని రెచ్చగొట్టింది తల్లి. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన పరాశరుడు అధర్వణ మంత్ర ప్రయోగంతో సుదీర్ఘ సత్రయాగం ఆరంభించాడు. ఆ యాగ ప్రభావం చేత మహామహులైన దానవులేందరో శలభాల్లా ఎగిరివచ్చి యాగాకుండలంలో పది మలమల మాడిపోయారు.

 

‘దానవజాతిని సమూలంగా నాశనం చెయ్యవద్దు’ అన్న తాత వశిష్టుడు కోరిక మన్నించి యాగాన్ని విరమించాడు పరాశరుడు. దానవజాతికి మూలపురుషుడైన పులస్త్య బ్రహ్మ సంతసించి “నా జాతి నాశనం కాకుండా  కాపాడావు. నీకేం కావాలో కోరుకో…”అన్నాడు.

” మహావిష్ణు పురాణమును సంస్మరణ మాత్రానే గ్రహించవలసిన భవ్య జ్ఞానాన్ని అనుగ్రహించండి.” అని వరం కోరుకున్నాడు పరాశరుడు. అలా భూలోకానికి చేరువైంది ‘మహావిష్ణు పురాణము’. యుగయుగాలుగా మానవజాతిని మాధవ భక్తి పరులుగా, మర్చి మోక్ష మార్గాన్ని చూపుతోంది ‘మహావిష్ణు పురాణము’ ఇంటింటా ఉండదగ్గ పురాణగ్రంధ రాజం ‘మహావిష్ణు పురాణము’.

Author

adanki Venkata Lakshmi Narasimharao

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Maha Vishnu Puranam”

Your email address will not be published. Required fields are marked *