ప్రియ మిత్రమా!
మొన్నా మధ్య మీ ఇంట్లో నేను పొందిన ఆతిథ్యానికి ఎంతైనా కృతజ్ఞుణ్ణి. అక్కడ నేను పొందగలిగినంత తృప్తిని స్వగృహంలో కూడా పొందలేకపోతున్నాననటం అతిశయోక్తి కాదు. అక్కడ గడిపిన నాలుగు రోజులూ నేను స్వర్గంలోనే ఉన్నానేమో ననిపించినవి.
అన్నిటికన్నా నన్ను ఆశ్చర్యపరిచింది ఏమిటంటే, మీ అన్యోన్య దాంపత్యం. చిలకా గోరింకల కాపరాలైతే నేను చూడలేదు కాని – మీలాటి దాంపత్యానికి మాత్రం ఆ పేరు సరిపోతుంది. నేను కూడా రెండేళ్ళ నుంచీ దాంపత్య జీవితాన్ని గడుపుతూనే వున్నాను. ఇతర స్నేహితుల కాపరాల్నీ చూస్తూనే వున్నాను. కాని నేను ఎరిగినంతవరకూ నువ్వు గడిపేలాటి ఆనందమయ జీవితం మరి లేదు. నీ సుఖమయ జీవితం నన్ను యీర్ష్యకు గురిచేసిందంటే నమ్ము.
జీవితంలో ఘొొోరమైన గడ్డు సమస్య ‘భార్య’ . ఈ భార్యను గూర్చిన సరైన విజ్ఞానం నాకు ఇంతవరకూ చిక్కకపోవటం వల్ల ఇలా భాదపడుతున్నానేమో ననిపించేది. కాని నా మిగతా మిత్రులు కూడా నాలాగే బాధపడటాన్ని గ్రహించాక, ఇది లోకమంతటా ఉన్న సమస్యేననీ, అతి సామాన్య విషయంగా ఏనాడో నిర్ణయించబడ్డడనీ తృప్తి కలిగింది. అలాటి సమయంలో మీ ప్రణయ జీవితం చూశాక నా తృప్తికి పెద్ద దెబ్బ తగిలింది. బుర్రలో ఒక ప్రళయమే పుట్టినంత పనయింది.
– ధనికొండ హనుమంతరావు
Reviews
There are no reviews yet.