ఆరుద్ర : ఏమయ్యా కవీ
నాదో మనవి
నువ్వెందుకు రాస్తున్నావ్
నూక లివ్వక పోయినా భావాల
మేక లెందుకు కాస్తున్నావ్ ?
శ్రీ శ్రీ : చెప్పిందే చెప్పిందే చెప్పిందే మళ్ళీ చెప్పడం
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కొందరికి కిష్టం
చెప్పంది చెప్పి మెప్పించాలని
చేస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నం
అదే అనుకుంటాను కవిత్వం
అనుకరణం అనవసరం
అంతేకాదు అనర్ధకం.
అందుకనే దేవుణ్ణి సహా ఇమిటేట్ చెయ్యడం
మానెయ్యడం
అదీ నా ప్రయత్నం
అదే నా కవిత్వం
ఈ మేకలే నాలోని పెద్దపులికి ఆహారం
నా కవిత్వం ఆ వ్యాఘ్ర్హం ఆకలి ఆకారం …….
………………………………………………
(కవితా ప్రయోజనం నుంచి )
“మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీ శ్రీ.
తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీ శ్రీ.
శ్రీ శ్రీ గారి ‘ఖడ్గసృష్టి’ 1966 లో వెలువడింది. అయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గసృష్టి కావ్యానికి 1966 లో సోవియట్ భూమి నెహ్రు అవార్డు, 1973 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979 లో శ్రీ రాజా లక్ష్మి ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీ శ్రీ.
Reviews
There are no reviews yet.