Kalnal Ekalingam Adventures

Rs.310.00

In stock

SKU: PRISM009 Category: Tag:
Author: Malladi Venkata Krishna Murthy

     జోక్ అతి చిన్నది. నవల అతి పెద్దది. చిన్న చిన్న జోకులని దండలా గుచ్చి ఓ వ్యక్తి జీవితగాధని అతి పెద్ద నవలగా రాయడం ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలిసారి. ప్రింట్ మీడియా ఎంటర్టైనర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన ఈ సాహితీ సర్కస్ ఫీట్ లోని డర్టీ, పార్టీ, రొమాంటిక్, ప్లేబాయ్, కేంపస్ జోక్స్ అన్నీ పాఠకులని ఎంటర్ టైన్ చేసేవే. మధ్య నుంచి మొదటికీ, లేదా చివరి నుంచి మధ్యకి కూడా చదువుకో దగ్గ మల్లాది రాసిన మొదటి నవల ఇది. అసలు హాస్యం ఎలా పుడుతుంది? ఎక్కడ అవకతవక లేదా అసంపూర్ణం ఉంటే అక్కడ హాస్యం పుడుతుంది.

ఉదాహరణకి సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందులో హాస్యం ఉండదు. అదే సుబ్బారావు రోడ్డు మీద నడిచి వెళ్తూ, అరటి తొక్క మీద కాలు వేసి జారిపడితే, ఆ అవకతవక లోంచి హాస్యం పుడుతుంది. ఇలాగే అందాన్ని ఎవరూ ఆక్షేపించరు. అనాకారితనం లోనే హాస్యం ఉంటుంది. అనేక విదేశీ జోక్స్ పత్రికలు ఇచ్చి సహాయం చేసిన మిత్రులు, కార్టూనిస్టు మీనా గారికి నా కృతఙ్ఞతలు.

                                                                                                                              – మల్లాది వెంకట కృష్ణమూర్తి

Author

Malladi Venkata Krishnamurthy

Format

Paperback