ఎందుకి ప్రయత్నం?
–
కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా జీవితం… అన్నాడో మహాకవి.
అయితే ఈ రెప్పపాటు జీవితంలో మనకు తెలియకుండానే మనకు ఎన్నో బంధాలు ఏర్పడతాయి.
పుట్టుకతోటే వచ్చేవి కొన్ని..మన ప్రయత్నంతో ఏర్పరుచుకొనేవి కొన్ని
ఈ బంధాలు వ్యక్తులతో ఏర్పడవచ్చు, ప్రదేశాలతో ఏర్పడవచ్చు. వస్తువులతో ఏర్పడవచ్చు..
ఏ బంధం ఎందుకు ఏర్పడుతుందో.. మాటలతోనో, రాతలతోనో చెప్పడం కష్టం .
ముఖ్యంగా మనసుతో ఏర్పరుచుకొన్నవి, హృదయంతో పెనవేసుకొన్నది…. అనుభవైకవేద్యాలే……
చంద్ర
ఒక స్నేహ బంధం కలకాలం ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా పరిమళించాలంటే, ఆ స్నేహ బంధం ఏర్పరుచుకున్న వారి మధ్య కనీసం కొన్ని కామన్ అభిరుచులు, ఆశయాలు, లక్ష్యాలు ఉండాలి.
ఆ లక్ష్యాల సాధనకు జట్టు కట్టాలనే ఉత్సాహం ఉండాలి. వారితో జట్టు కడితే లక్ష్య సాధన సులువు అవుతుందనే గట్టి నమ్మకం ఏర్పడాలి.
అలా పరిచయం అయిన కొద్ది రోజులలోనే.. నాకు రాజశేఖరరెడ్డి పేహంపై ఒక గట్టి నమ్మకం ఏర్పడింది……….
Reviews
There are no reviews yet.