బుద్ధుడి నుంచి కానీరామ్ వరకు భారత సామాజిక రంగంలో తమ భావజాలంతో పెనుప్రకంపనలు సృష్టించిన 25 మంది సామాజిక విప్లవకారుల చరిత్రను, నాటి సామాజిక స్థితిగతులను వారి భావజాలంలోని కీలకాంశాలను సంక్షిప్తంగా, సూటిగా పరిచయం చేసే రచనే ఈ బహుజన్ వారియర్స్.
ఈ ఆలవాల గవర్రాజు ప్రముఖ హేతువాది, విద్యావేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలనా పోరాటాలలో చురుకైన పాత్ర పోషించారు. దళిత బహుజన కార్యకర్తగా ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొని అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళా చైతన్యం కోసం ఎన్నో శిక్షణా తరగతులను నిర్వహించారు. పంచాయతీరాజ్ ప్రతినిధుల కోసం ట్రైనింగ్ మాడ్యూల్స్, కరదీపికలు, లోక్ సత్తా కోసం సిటిజెన్ చార్టర్ రూపొందించారు. ఇతర మేధావులతో కలిసి హిందుకోడ్ బిల్లు అనువదించారు.
Reviews
There are no reviews yet.