ఇది శాస్త్రవచనం కాదు. వేదభాష్యం అంతకన్నాకాదు. ఇది శ్రీవిద్యా సాధనకు సంబంధించిన చర్చ మాత్రమే. ఈ చర్చ అంతర్గత భావానికి భంగం కలిగించకుండా ఒక విషయం నుండి మరియొక విషయానికి మారుతూ ముందుకు సాగుతుంది. ఈ కథనంలో కపటంగానీ , సందర్భానుకుల కల్పనలు గానీ లేవు. కేవలం నిజాలు మాత్రమే ప్రస్తావించబడినాయి. ఇది సత్యాన్వేషణ చుట్టూ తిరిగే సత్యవిషయ సంకలనం. సాధనా మార్గంలో కలిగే సందేహాలను నివృత్తి చేసే కొన్ని సమాధానాల క్రోడీకరణ.
సాధన అంటే ఏమిటి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? సాధనయొక్క ఫలితాలేమిటి? దాని పర్యవసానంగా భగవతుని ఉనికిని గ్రహించడం ఎలా సాధ్యం? లాంటి లాంటి విషయాలను గురించి ఇక్కడ స్పృశించడం జరిగింది.