ఆంధ్రుల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ కు తనదంటూ ఒక రాజధాని ఏర్పడే దశలో మళ్లీ విఘ్నం ఎదురైంది. ఈ పరిణామంతో వర్తమాన తెలుగు సమాజానికే కాదు, రానున్న తరాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. నగరానికి, నాగరికతకు దగ్గర సంబంధం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రప్రదేశ్ వికసించాలంటే రాజధాని నగరం అవసరం.
అశాస్త్రీయ విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అమరావతి విషయంలో మరొక తప్పిదం చేస్తున్నదన్న ఆవేదనతో రాసిన పుస్తకం ఇది. గతంలోనే కాదు, సమకాలీన చరిత్రలో కూడా ఆంధ్రులకు రాజధాని అందని ద్రాక్షపండుగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకోడానికి చేసిన ప్రయత్నం ఇది.
Reviews
There are no reviews yet.