అక్షరాభ్యాసం
ఆ రోజు నేను స్కూల్లో పాఠం చెబుతున్నప్పుడు నా స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేసి శనివారం నాడు తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నాననీ, నన్ను తప్పక రమ్మని చెప్పాడు.
నేను, పద్మనాభం చిన్నప్పట్నించీ ఒకే ఊరిలో పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరం బీఈడీ చేసాం. నేను పట్నంలో మున్సిపల్ టీచరుగా ఉద్యోగం చేస్తుంటే, వాడు మా ఊరి స్కూల్లోనే టీచర్ గా పని చేస్తున్నాడు. వాళ్ల నాన్న పాతికెకరాల భూస్వామి కావడంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా ఊళ్లోనే పోస్టింగ్ వేయించుకున్నాడు.
– పద్మనాభం ఓ పక్క టీచరు ఉద్యోగం చేస్తూనే ఇంకో పక్క వ్యవసాయం కూడా చేస్తుంటాడు.
వాడికి ఆరేళ్ల క్రితం పెళ్ళైంది. వాడెందుకో ముప్పై ఏళ్ల తరువాత పెళ్ళి
చేసుకున్నాడు.
నేను మా నాన్నగారి దగ్గర స్మార్తం నేర్చుకున్నాను. మా నాన్న గారు మా ఊరి పురోహితుడు. ముందు నన్ను చదివించనన్నారు. నేను చదువుకుంటానని పట్టుపట్టడంతో తప్పక నన్ను చదివించారు.
కానీ కులవృత్తి అని స్మార్తం నేర్పించారు. రెండేళ్ల క్రితం నాన్నగారు చనిపోవడంతో ఊరికి పురోహితుడు లేకుండా పోయాడు. అందుకే ఈ రోజు పద్మనాభం నన్ను పిలిచాడు.. నేనైతే రెండు విధాలుగా ఉపయోగపడతాననీ వాడి ఆశ. |
ఈ విషయం నాకు చాలా రోజుల నుంచీ వాడు చెబుతున్నాడు. వాడి కొడుకు అక్షరాభ్యాసం నేనే చేయించాలనీ.
నేను శుక్రవారం రాత్రి బయలుదేరి ఆఖరి బస్సుకి మా ఊరు వెళ్లాను.
Reviews
There are no reviews yet.