Aha Oho Ikigai

90.00

In stock

SKU: MASTE001 Category: Tag:
Author: Putta Gunta Suresh Kumar
  1. ప్రారంభం

అది అందాల మైసూరు నగరంలోని దాసప్రకాష్ హోటల్.

ఆటోలోంచి దిగిన పూర్ణిమ చకచకా నడుస్తూ తన అన్నావదినలు బస చేసిన గదికి వెళ్లింది.

ఆమె అన్నయ్య రత్నాకర్ ప్రముఖ వ్యాపారవేత్త, వదిన వనజ వైద్యురాలు. వాళ్లకు తొమ్మిదో తరగతి చదువుచున్న పదమూడేళ్ల బాబు అన్వేష్. వాళ్లు ఉండేది హైదరాబాద్లో.

గదిలో అడుగు పెట్టిన పూర్ణిమను చూడగానే “చెల్లీ, వచ్చేశావా! పద పద. మాకు మంచి అల్పాహారం పెట్టిద్దువుగాని” అన్నాడు రత్నాకర్ సరదాగా నవ్వుతూ,

“రాకరాక వచ్చారు. అల్పాహారంతో సరిపుచ్చుతానేంటి! మీరిక్కడ ఉన్నన్ని రోజులూ మా మైసూరు ప్రసిద్ధ వంటకాల రుచి చూపిస్తాలే, అన్నయ్యా” అంది పూర్ణిమ కొంటెగా.

వనజ అందుకుని “మేముండేది ఈ రోజు సాయంత్రం వరకేనమ్మా. తరువాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. వ్యాపారరీత్యా మీ అన్నయ్య విదేశాలకు వెళ్లాలట” అంది.

“అవునా ? ఇంతకీ మీరు ఏ పనిమీదొచ్చారు, వదినా ?” అడిగింది పూర్ణిమ.

“మీ అన్నయ్యకు ఇక్కడ ఏదో ముఖ్యమైన బిజినెస్ పని ఉంది. నాకేమో మా డాక్టర్ల సదస్సు ఉంది. అవును పూర్ణిమా, ఇక్కడ మైసూరు విశ్వవిద్యాలయంలో ఎంతో ఇష్టపడి సైకాలజీ కోర్సులో చేరావు కదా! ఎలా ఉంది ?” అడిగింది వనజ…………

Author

Putta Gunta Suresh Kumar

Format

Paperback