Achanchala Ekagratha Shakthi

Rs.499.00

In stock

ఉపోద్ఘాతం

ఒక హిందూ సాధువుగా మా గురువుగారితో వారి ఆశ్రమంలో గడిపిన సమయం నా జీవితంలో మహోత్తమ వరప్రసాదం. నేను చాలా నేర్చుకున్నాను. నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉన్నదని గ్రహించాను. ఆత్మవికాసం జీవితాంతము జరిగే కృషి అని, నాకు దారి చూపటానికి తాను అంతకాలం ఉండబోవటం లేదని తెలుసుకొని, ఆయన నా ఆత్మవికాసానికి పునాదులు వేశారు. దురదృష్ట వశాత్తూ ఆయన ఊహ కటిక సత్యం అయింది. నేను వారి ఆశ్రమంలో చేరిన మూడు సంవత్సరాలకే ఆయన కాలం చేశారు.

ఆయన స్వర్గస్థులయిన తర్వాత ఏడు సంవత్సరాలకు, అంటే ఆయన ఆశ్రమంలో సాధువుగా ఒక దశాబ్దం గడిపిన తర్వాత, నా ప్రమాణాలు, శపథాలు పునరావృత్తి చెయ్య దలుచుకోలేదు. ఒక హిందూ పురోహితుడిగా జీవించటానికి నిశ్చయించుకొని, బయటి ప్రపంచంలో అడుగు పెట్టాను. న్యూయార్క్ నగరం నా స్వస్థలం అయింది. హిందూమతంలో పురోహితులు గృహస్థులుగా ఉంటారు. వారు వివాహం చేసుకుంటారు, జీవనోపాధిలో పని చేస్తారు, అందరు గృహస్థుల లాగానే సంపాదిస్తారు.

నేను 2008 ఉత్తరార్ధంలో రెండుజతల బట్టలతో ఆశ్రమంనుంచి బయటికి వచ్చాను. అప్పుడు ప్రపంచం అంతా విపరీతమయిన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. నా చేతిలో వెయ్యి డాలర్లతోబాటు ఒక ‘మాక్ బుక్ ప్రొ’ ఉన్నది. ఆ డబ్బు, ల్యాప్టాప్, బాహ్య ప్రపంచంలో అడుగు పెడుతున్న నాకు, ఆశ్రమం ప్రసాదించిన ఉదార ఆత్మీయ సహాయం. నా ప్రాపంచిక సంపద చాలా పరిమితం. నా ఆధ్యాత్మిక వికాసానికి, అర్ధం చేసుకుని ఆచరించటానికి, ఆశ్రమవాసంలో నా గురువు నాకు చాలా బోధనలు. సాధనాలు ప్రసాదించారు. అవే నా శక్తి.

జీవితంలో తర్వాతి అంకం సృష్టించటానికి ఈ సాధనాలు చాలునని నాకు తెలుసు. ఆశ్రమంలో ఉన్నపుడు అవి ఫలితాలు చూపాయి. బయటి ప్రపంచంలో కూడా అవి ఫలిస్తాయని నాకు తెలుసు. ఈ ప్రాచీన బోధనలన్నీ జగమెరిగిన సత్యాలకు………………….

author name

Dandapani

Format

Paperback