మహాసామ్రాజ్య స్థాపకులు అలెగ్జాండర్ ది గ్రేట్: Alexander- The Founder of the Great Empire

125.00

In stock

 చరిత్ర గతిని మార్చిన గ్రంధకర్తలవలెనే ప్రపంచ చరిత్రలో చరిత్ర గతిని మార్చిన వీరాధివీరులేందరో.క్రీ||పూ. నుండి నేటి వరకూ గల ఆ వీరుల సంగ్రహ చరిత్ర రాయాలనేది ఈ రచయిత సంకల్పం.
               మసేడోనియా రాచరిక వంశంలో జన్మించిన అలెగ్జాండర్ తన తండ్రి అప్పటికే మసేడోనియా గ్రీస్ దేశాలను ఏకం చేసి తన 46వ ఏట మరణించగా తాను అతడికి వారసుడై అరిస్టాటిల్ వంటి గొప్ప తాత్త్వికుడి వద్ద విద్యాబుద్దులు గడించి తన 20వ ఏట వారసత్వం స్వీకరించి తండ్రి చనిపోగానే గ్రీస్ లో  వెల్లువెత్తిన అలజడులను అణచి తన పొరుగునే ఉన్న మహా పెర్షియన్ సామ్రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని జయించడమేగాక అక్కడి గ్రీక్ బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ లోని గాంధారం వరకూ ఉన్న పెర్షియన్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడమేగాక భారతదేశంలోని పంజాబ్ వరకూ జయించిన మహావీరుడు. సైన్యం అలసట చెంది, తను గాయపడి జైత్రయాత్ర ముగించి తిరిగి తన స్వదేశం వెళుతూ స్వదేశంలో ఘనస్వాగతం లభించక ముందే మార్గమధ్యంలో మధ్య ఆసియాలోని బాబిలోనియాలో మరణించాడు.
                   వీరి జీవితాలు యువతకు నేటి ప్రపంచంలో కూడా నాయకత్వ లక్షణాలు నేర్పుతాయని ఆశించడమే ఈ రచనకు కారణం.

author name

సత్యం శంకరమంచి

Format

Paperback