-
-
-
Mudu Darulu
₹395.00రాజకీయాలు….ఒక సమాలోచన
చరిత్రను తిరగదోడటం దేనికి? చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా? రావచ్చు. కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు, వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది. చరిత్రను అవలోకించడం ద్వారా నిర్మొహమాటంగా, నిర్ద్వంద్వంగా సంఘటనను విశ్లేషించే వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి, చరిత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. అలా అని చెప్పి, భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఇప్పుడు కాచివడబోయాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి పాత్ర అమోఘమైనది. దాని రచనకు పూనుకుంటే అదొక ఉద్గ్రంథమే అవుతుంది. కానీ అది ఈ రచయిత పని కాదు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటగా భాషప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మన రాజకీయాలను, సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మన చరిత్రలో ఆనాటి సంఘటనలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరణను కోరుతూ ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగాయి. వాటిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు కూడా జరగకపోలేదు. ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను………………..
-
Sir Thomas Munro
₹40.00రావినూతల శ్రీరాములు బహుగ్రంథ రచయిత. ముఖ్యంగా జీవనచరిత్రల రచనలో అందెవేసిన చేయి. 60 కి పైగా గ్రంథాలు రచించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆయన రచనలకు గాను 1977 లో జాతీయ అవార్డును, జీవిత చరిత్రల రచనకు గాను 1995 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆంధ్రప్రదేశ్ నుండి 2015 ఉగాది పురస్కారాన్ని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వారి 2016 సద్గురు శివానందమూర్తి ప్రతిభా పురస్కారాన్ని పొందారు.
సర్ థామస్ మన్రో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగువారి అభిమానాన్ని సంపాదించాడు. తెలుగు వారిని అభిమానించాడు.
తెలుగు వారికీ ప్రీతిపాత్రులైన బ్రిటిష్ అధికారుల్లో సి. వి. బ్రౌన్ తర్వాత చెప్పుకోదగిన సర్ థామస్ మన్రో సంక్షిప్త జీవిత గాథ ఇది.
– రావినూతల శ్రీరాములు
-
Dakkali Jaambapuraanam (Telugu)
₹280.00భారతీయ సమాజంలో మూలవాసీ సంస్కృతిని వెలికి తీయడానికీ , జాతుల సమస్యలోని వివిధ కోణాల్ని అధ్యయనం చేసి లోతుపాతుల్ని గ్రహించడానికీ ,
తరతరాలుగా మరుగున పడివున్న ఉత్పత్తి కులాలకు చెందిన ప్రజాశ్రేణుల చరిత్ర అవగాహనకీ , వారి మధ్య నెలకొన్న సాంస్కృతిక అగాథాల్ని పూడ్చి ఐక్యత సాధించడానికీ
మౌఖికంగా భిన్న రూపాల్లో లభ్యమౌతున్న జాంబ పురాణాలు ఎంతగానో దోహదం చేస్తాయి.
-
Vidvamsam
₹550.00కులాన్ని అర్థం చేసుకోవడం ఎలా? · కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం · అంతర్జాతీయం · అణచివేత – అణచివేత చట్టాలు · విజన్ – విధ్వంసం …
-
Adugaduguna Tirugubatu
₹499.00నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?
నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో ‘బ్రా’లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే – పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో ‘బ్రెయిన్ వాష్’ చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న ‘రివర్స్’ చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ…………
-
Ivee Mana Moolaalu
₹450.00సాహసం, కానీ ఎంతో అవసరం
కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని 1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం'(1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.
ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి. నరసింహారావుగారి ‘ఇన్సైడర్’కు ‘లోపల మనిషి'(2002) పేరుతో ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రామ్మోహన్ గాంధీ రచన ‘మోహన్ దాస్’కు చేసిన అనువాదం(2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలికస్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే'(2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.
ఈ బృహధ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ‘ఇవీ మన మూలాలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న ఈ పుస్తకం ఒక ఎత్తు. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం.
—-ఇవీ మన మూలాలు 7
-
Russian Classics
₹225.00రష్యన్ విప్లవం జరిగిన వంద సంవత్సరాలు గడిపోయాయి. ఈ విప్లవానికి ముందే “జార్” రాజు పరిపాలించే రష్యాలో నూతన ఆలోచనా ధోరణుల పెల్లుబికాయి. పట్టణాలలో డిసెంబరీష్ట్ తిరుగుబాటు, గ్రామాలలో రాచరిక భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బానిసల, అర్ధబానిస రైతులలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. వాటి ప్రభావం వల్ల మేధో, మధ్యతరగతి వర్గాలలో ఓ చైతన్యపూరితమైన కదలిక ప్రాభవం అయ్యింది. దీని ప్రబింబమే రష్యన్ మహారచయితల ఆవిర్భావం.
రష్యన్ ఆకాశం పై వెలిసిన వేగుచుక్కలు, పుష్కిన్ , గోగోల్, తుర్గెనోవ్,, కుప్రిస్, చేవోహ్, గోర్కీలు . వీరి రచనలు అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ బాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకు అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియట్ పతనం అనంతరం ఈ సాహితిధార ఆగిపోయింది.
-
Madi Vippina Charitra
₹250.00గురువుగా ద్రోణాచార్యుని ప్రతిభా కౌశలం గురించి, మంత్రిగా కౌటిల్యుని సామర్థ్యం గురించి
చరిత్ర పుస్తకాలలో చదివే పిల్లలకు, ఆ ఇద్దరూ వాస్తవానికి ఏ నిర్వచనం ప్రకారం చూసినా మహా కపటులన్న విషయం తెలియజెప్పాలి.సత్యవర్తన, న్యాయం, సర్వజనుల సమానత్వ భావనలకు ప్రాతినిధ్యం వహించే హిందూమతం ఈ దేశపు ప్రత్యేకత అని చెప్పే సమయంలో అది కులం, పితృస్వామ్య వ్యవస్థలతో దళిత బహుజనులను, స్త్రీలను ఏవిధంగా అణచివేసిందో కూడా వివరించాలి.గాంధీ జీవిత చరిత్రను శ్లాఘించే రచనలు చేసినప్పుడు ఆయన కులవ్యవస్థను, బ్రాహ్మణతత్వాన్ని బలపరిచాడన్న వాస్తవాలను విస్మరించకూడదు. -
Memu Kuda Charitra Nirmincham By B Anuradha
₹350.00అవును… చరిత్రనే సృష్టించారు
ఇంగ్లిష్ అనువాదానికి ముందుమాట –వందనా సోనాల్కర్
“ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి మా ఊరి నది దగ్గర కున్బీలకు, మహార్లకు వేరు వేరు బండలు ఉన్నాయి. అయినా నేను కావాలనే కున్బీల బండ దగ్గరకెళ్ళి నా బట్టలు ఉతికాను. మరుక్షణం నలుగురు కున్బీ ఆడవాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి ‘ఏయ్ మహార్నీ నీకు కళ్ళేమైనా దొబ్బాయా? ఇది మా బండ అని తెలియదా నీకు?’ అని అరిచారు.
‘ఎవర్నే మహార్నీ అంటున్నారు? ఏం…నా బట్టలు ఇక్కడ ఉతికితే ఏమవుతుంది? కావాలంటే మీ బండ మీద నీళ్ళు పోసి శుద్ధి చేసుకోండి’ అన్నాను. వాళ్ళు వెంటనే ‘ఎంత పనికిమాలిన ఆడదానివి నువ్వు’ అనేసరికి నేను కోపం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళల్లో ఒకామె జుట్టు పట్టుకున్నాను. నన్ను మహార్నీ అని ఎవరైనా పిలిస్తే నాకు మహా కోపం వస్తుంది. అలా పిలిపించుకోవడం నాకు చెడ్డ అసహ్యం. పెద్ద గొడవయ్యింది. వాళ్ళు నలుగురు ఉన్నారు. నేను ఒక్కతిని. అయితేనేం నేను ఒక్కదాన్ని చాలదా వాళ్ళకు జవాబు చెప్పడానికి. ఇంతలో మా మామగారు జోక్యం చేసుకుని గొడవ ఆపారు.”
“నా మొదటి గీతం నేను భీమ్ కోసం పాడతాను
నేను సత్యాగ్రహంలో పాల్గొని, ఆయన్ని దగ్గరనుండి చూస్తాను.
నా రెండవ గీతం అతనికే
మాకు నీరు తోడుకొనే హక్కు ఎవరు ఇచ్చారో
ఆయన కారణంగానే, బాయి, మేము ఈ వ్యాన్లో సంతోషంగా ఉన్నాము. నా మూడవ గీతం,
ప్రజలందరినీ ఆనంద వధువులా చేసిన
రమా ఆయి స్వామికి”,
మొదటి పేరాలో ఉటంకించిన సంఘటన ఈ పుస్తకం రెండవ భాగంలో ఉన్న దళిత మహిళల ఇంటర్వ్యూల నుండి తీసుకున్నది. ఒక మహార్ మహిళ అటువంటి పని చేస్తే ఈ రోజైనా అలాంటి ప్రతిస్పందనే ఎదురవ్వొచ్చు. భారత గ్రామీణ జీవిత వాస్తవికత……………
-
Decoding the Leader By Dr Peddi Rama Rao
₹150.00గోదావరి మీద వాకింగ్ స్ట్రీట్
రాజమౌళికి కోటి రూపాయలిచ్చి సినిమా తీయమన్నా
మనుకోండి! మిమ్మల్ని ఎగాదిగా చూసి కత్తిలాంటి ఒక
కొత్త ఆయుధం తయారు చేయించటానికి కూడా ఈ కోటి
సరిపోవూ అంటాడు.ఆయన ఊహాశక్తికి తగ్గ స్థాయిలో సినిమా తీయాలంటే ఎన్ని కోట్లు కావాలో ఆయనకు కూడా తెలియదు. తన ఊహాశక్తికి తగ్గట్టుగా ఆయన తీస్తూ పోతే, ప్రొడ్యూసర్ కూడా అట్లానే డబ్బులు పెడుతూపోవాలి. చంద్రబాబుగారు కూడా అంతే! తన ఊహాశక్తికి తగ్గ స్థాయిలోనే ఏ పనైనా జరగాలని తపన పడతారు.
అప్పటికింకా అమరావతి శంకుస్థాపన కూడా కాలేదు. రాజమహేంద్రవరంలో అప్పుడెప్పుడో బ్రిటీష్ వాళ్లు కట్టిన హావ్ లాక్ బ్రిడ్జ్ పాత ఇనప సామాను కింద వేలం వేసి అమ్మేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే గూగులమ్మనడిగితే హావ్ లాక్ బ్రిడ్జ్ పొడవు మూడు కిలోమీటర్లని, గోదావరి నది మీద అటు కొవ్వూరునీ, ఇటు…………..
-
-
-
-