-
Nenu Mee Bramhanandam
ఈ పుస్తకం ఎందుకు చదవాలి?
నేనేంటో నా సినిమాలు చెప్తాయి…
నేనేంటో మీ హృదయాలు చెప్తాయి…
నేనేంటో నా అవార్డులు చెప్తాయి…
నేనేంటో నా బిరుదులు చెప్తాయి…
కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు…
నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో,
ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు.
మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే.
ఆ రెండోవైపే ఈ పుస్తకం!
ఇందులో నా జీవితం యథాతథం!!
***
ఒకరి అనుభవం – ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు.
ఒకరి అనుభవం – ఒకరికి మార్గదర్శకం కావొచ్చు.
ఆ ఒకరు మీరు కావొచ్చు!
మీలో ఒకరైనా కావొచ్చు!
అందుకే నేను – నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను………
-
Na Daivam N T R
అది ఒక యోగం.
ఆయన ఒక దైవం!
ఇది నిజం.
ఈనాటి ఈ బంధం ఏనాటిదో…
ఉడతాభక్తిగా ఈ పొత్తం.
ఊహ తెలిసిన దగ్గర నుంచి అదే అభిమానం.
ఋషిని చూసాను ఆయనలో.
ౠకలకు కాదు ఇది.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఇది.
ఏనాటికీ చెక్కు చెదరని అభిమానం అది.
ఐరావతం ఎక్కినంత ఆనందం, ఆయన నా భుజం మీద చెయ్యి వేస్తే… ఒకింత అనుమానం వద్దు, ఆయన దీవిస్తే అంతే… ఓటమి ఉండదు. అంతా ముందడుగే. ఔత్సాహికుల్లారా నిద్రలేవగానే అంతఃకరణ శుద్ధితో ఆయన్ని స్మరించుకోండి. అంతా మంచే జరుగుతుంది.
అ నుంచి అః వరకు ఇది నా దైవానికి సమర్పించిన అక్షరమాల.
ఎక్కడో మేడూరు అనే గ్రామంలో పరుచూరి రాఘవయ్య, హైమావతమ్మల కడుపున నాల్గవ సంతానంగా జన్మించిన ఈ పరుచూరి గోపాలకృష్ణ గుండెల్లో దైవంగా నందమూరి తారకరామారావు గారు ఎలా వెలిశారు, ఆ దైవం ఆశీస్సులు………..
-
Andaala Natudu Harnath
అందాలుచిందే రూపం…! అలచందమామ రూపం!!
హరనాథ్ పూర్తి పేరు బుద్దరాజు అప్పల వేంకటరామహరనాథరాజు. ఈయన జీవిత చరిత్ర గురించి సవివరంగా చెప్పగలవారు నేడు ఆంధ్రదేశంలో కనుమరుగైపోయారు. ‘యూ ట్యూబ్’ వంటి వాటిల్లో చాలామంది హరనాథ్ గురించి ‘పలు గాలి కబుర్లను పోగేసి చెప్పినా, వాటిలో సత్యాసత్యాలను విడదీసి తెలుసుకోవాలంటే, హంసలా క్షీరనీరాలను వేరు చేసే విచక్షణాజ్ఞానం అవసరం! హరనాథ్ జీవితవిశేషాలు, ఆయన తండ్రి వరహాలరాజు రచించిన ‘శ్రీ ఆంధ్రక్షత్రియ వంశరత్నాకరము’ అనే గ్రంథంలో కొద్దిగా లభిస్తున్నాయి. సత్యం మాత్రమే తెలుసుకోదలచిన విజ్ఞులకు వరహాలరాజు రాసిన జీవితవిశేషాలే ఆధారం.
హరనాథ్ మాతామహులు సాగిరాజు సుబ్బరాజు, వీరి శ్రీమతి సుభద్రయ్యమ్మ. ఈ దంపతుల కుమార్తె రామయ్యమ్మ. ఈవిడను కూడా సుభద్రయ్యమ్మ అనే అందరూ అనేవారు. సుబ్బరాజు తమ కుమార్తెను వరహాలరాజుకిచ్చి వివాహంచేశారు. వరహాలరాజు మంచి రచయిత మాత్రమే కాదు, రంగస్థల నటుడు కూడా! ఈయన 1945వ సం||లో, మద్రాసులోని వి.పి.హాలులో ప్రదర్శించబడ్డ ‘ఖిల్జీరాజ్యపతనం’ నాటకంలో కథానాయకుడి పాత్ర…………. -
-
Rafi
టు విద్యా రంగంలో, ఇటు సాహిత్య రంగంలో విశేష కృషి సాగిస్తున్న కొద్దిమంది ఆధునిక తెలుగు రచయిత్రులలో సి. మృణాళిని స్థానం ప్రత్యేకం. పాత్రికేయురాలిగా, రేడియో వ్యాఖ్యాతగా, బుల్లితెర కార్యక్రమాల నిర్వాహకురాలిగా, విమర్శకురాలిగా, కథకురాలిగా, అనువాదకురాలిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యురాలిగా బహుముఖ ప్రతిభను చాటిన మృదుభాషి మృణాళిని. తన ప్రతిభను గౌరవిస్తూ ఇప్పటివరకు 23 పురస్కారాలను వివిధ సంస్థలు ఆమెకు అందజేశాయి.
– సి. మృణాళిని -
Sathavasamthala Ghantasala
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన” అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను.
-శ్రీశ్రీ
అతడు కోట్ల తెలుగుల ఎద
అంచుల ఊగిన ఉయాల
తీయని గాంధర్వ హేల
గాయకమణి ఘంటసాల– డాక్టర్ సి. నారాయణ రెడ్డి
ఘంటసాలవారి కమనీయ కంఠాన
పలుకనట్టి రాగ భావమేది!
ఘంటసాలవారి గాన ధారలలోన
తడియనట్టి తెలుగు టెడద యేది!– దాశరధి
చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై
తళతళ మెరయు గంధర్వతార
తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు
వేలకొలది గీతమ్ముల నాలపించి
ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి
కంఠకర్తారమాల! మా “ఘంటసాల!”– కరుణశ్రీ
-
Prapancha Cinima Charitra
ఇది మానవజాతి చరిత్ర
మా ఊరి టెంటు సినిమాలో నేను చిన్నప్పుడు చూసిన తెలుగు సినిమానే నాకు మొట్టమొదట తెలిసిన సినిమా. చదువు కోసం మద్రాసు వచ్చిన తరువాత హిందీ, ఇంగ్లీషు సినిమాలు పరిచయమయ్యాయి. చాలా సంవత్సరాల వరకు సినిమాలంటే ఇవే అనే భ్రమలో ఉండేవాణ్ణి. 1951లో మొట్టమొదటిసారి మద్రాసులో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరిగినప్పుడు తెలిసొచ్చింది సినిమా విశ్వరూపం ఏమిటన్నది. Yukiwariso, Rashomon, Bycicle Theives, Umbrellas of Cherbourg లాంటి సినిమాలు చూసేసరికి ఒక్కసారిగా సినిమాల మీద నాకున్న దృక్పధం పూర్తిగా మారిపోయింది. ఇదొక గొప్ప కళ. మానవజాతిని ముందుకు నడిపించే శక్తి గల కళ. అప్పట్నుంచి, ప్రపంచంలో ఏ ఏ మూల ఏ ఏ సినిమాలు వున్నాయో వెతకటం మొదలుపెట్టాను.
ఆ సమయంలో Marie Seton మద్రాసు వచ్చారు. ఆమె ఐసెన్స్టీన్ (Eisenstein) శిష్యురాలు. సినిమా మీద ఎంతో పరిశోధన చేసారు. ఆమెను నేను కలిసాను. రష్యన్…………………..
-
-
Varma Mana Karma The Passion Of RGV
అసలాయన్ని డిఫైన్ చేయాలంటే ఎవరికీ సాధ్యం?ప్రపంచంలోని ఏ వస్తువునైనా, దేన్నైనా డిఫైన్ చేయగలం. మనకున్న స్పర్శ, జ్ఞానం, తెలివి అన్నింటిని బేస్ చేసుకుని… మనకి చల్లగా తగిలితే ఇది గాలి అని, వేడిగా తగిలితే ఇది సెగ, అని, నీళ్ళని చూడగానే నీళ్లు అని… ఇలా దేన్నైనా డిఫైన్ చేయగలం. పంచభూతాలని డిఫైన్ చేయగల, అర్థం చేసుకోగల మనం… ఈ వర్మని డిఫైన్ చేయమని అడిగితె మాత్రం సరిగ్గా ఇది చెయ్యలేం. ఎందుకంటే…. అతడ్ని జ్ఞాని అన్నా, పిచ్చోడన్నా, తెలివైనవాడు అన్నా ఏది అన్నా కూడా చివరికి అతను ఇదే అని చెప్పడం మాత్రం కష్టం, చాలా కష్టమైన పని. అంటే మాటలకూ, నిర్వచనాలకు అందని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.కొంతలో కొంత ఇతడ్ని డిఫైన్ చెయ్యడానికి….A Man beyond everything అనుకోవచ్చు…అంటే వర్మ అన్నిటిని మించిన మనిషి అని.