కరువు నేలలో వొలికిన వ్యంగ్య రసం
పాలగిరి విశ్వప్రసాద్ – 9866511616
రాయలసీమ సాహిత్య చరిత్రను పరిశీలిస్తే వ్యంగ్యం చాలా తక్కువగా కనిపిస్తుంది. వెటకారం, ఎత్తిపొడుపు, దెప్పిపొడుపు, పరుషోక్తి – ఇవి కొంచెం అటుఇటుగా వ్యంగ్యానికి మరో పేర్లు (పర్యాయ పదాలు). రాయలసీమ జీవితంలో వెటకారం తక్కువే. ఇక్కడి మనుషులు ఒక పరిమితి వరకు పరాచికాలాడుకుంటారు గానీ ఒకర్నొకరు వెటకరించుకోవడం చాలా తక్కువ. పరాచికాలాడడం, పరిహాసం చేయడంలో విమర్శ వున్నా నొప్పించే గుణం వుండదు. అది కూడా చాలా చనువు, సఖ్యత వున్నవాళ్ళ నడుమా, వరుసైన వాళ్ళ నడుమా వుంటుందే గానీ, ఏమంత చనువు లేని వాళ్ళ నడుమ వుండదు. వ్యంగ్యంలో వున్న విమర్శ అర్థమైతే నొప్పిస్తుంది. అర్థమైతే అనడం ఎందుకంటే వ్యంగ్యంలో నేర్పరితనం (చతురు) ఉంటుంది. ఎవరిని అధిక్షేపిస్తున్నాడో తెలుస్తుంటుంది. అయితే తమనే అధిక్షేపిస్తున్నాడని ఆ మనిషి (లేదా అటువంటి మనుషుల గుంపు) బయటపడలేరు. తేలు కుట్టిన దొంగ మాదిరి నోరు బిగబట్టుకోవాల్సిందే. రాతలో ఈ నేర్పరితనం ఉంటేనే దాన్ని అసలైన వ్యంగ్య రచన అనవచ్చునని నా అభిప్రాయం. ఈ తూనికరాయితో తూకమేస్తే మనం వ్యంగ్య అనుకుంటున్న చాలా రచనలు వ్యంగ్యం కాకుండా పోతాయి.
రాయలసీమ జీవితంలో వ్యంగ్యం లేకపోవడానికి కారణం అందులో ఉన్న నొప్పించే తత్వమే. దీనర్థం రాయలసీమలో ఎదుటి మనుషులను నొప్పించాలనే తత్వం లేదని కాదు. ఇక్కడి మనుషుల్లో సహనం తక్కువ. ఉద్రేక స్వభావం ఎక్కువ. ఆ లక్షణాలు ఇక్కడి జీవితాల్లోని అసహనం వల్ల ఏర్పడినవే. అసహనం ఎందుకంటే చాలినంత జీవన భృతులు లేకపోవడం. అంతిమంగా అన్నిటికీ మూలం కరువు. వెటకారం చేసుకుంటే అది చిలికి చిలికి గాలివానై పార్టీలుగా మారిన సందర్భాలు యిక్కడ లెక్కలేనన్ని. అందుకే వ్యంగ్యం యిక్కడి జీవితాల్లోకి రాలేదు. జీవితాల్లో లేని లక్షణం కథల్లోకి రాలేదు. రాయలసీమ నుండి వ్యంగ్య కథలు చాలా తక్కువ రావడానికి యిదొక కారణం.
ఇక్కడి సామాజిక స్థితిగతుల వల్ల, రాయలసీమలో జీవితాన్ని రియలిస్టిక్గా చెప్పిన వాళ్లే ఎక్కువ.
ఇతర ప్రాంతాల్లో ఈ వ్యంగ్యరసం పాలు ఎక్కువ. విశ్వనాథ సత్యనారాయణ (విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు), మొక్కపాటి నరసింహ శాస్త్రి (బారిష్టర్ పార్వతీశం), పానుగంటి……………….
Reviews
There are no reviews yet.