స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (1927-2014) ను, ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన ‘వందేళ్ల ఏకాంతం’ నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.
తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, సెక్సు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ.
ఇందులోనివన్నీ సార్వజనీన అనుభవాలు కనకే ‘వందేళ్ల ఏకాంతం’ ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.