తనలో నన్ను
నాలో ఆత్రుత మొదలైంది. “ఆరున్నర దాటినా ఇంకా ఇంటికి రాలేదేంటి వీళ్ళు?” అప్పుడప్పుడూ ఇంతకు ముందిలా జరిగినా తను సర్దుకుంది కానీ ఈ మధ్య వల్ల కావటం లేదు. ఎక్కువ సమయం కూడా దొరకదు సాయంత్రాలు ఇక్కడే చూస్తూ కూర్చోవటానికి.
“ఎక్కడి కెళ్ళుంటారో? ఎప్పుడొస్తారో?”
నేనూ నా ఆలోచనలూ. నేను ఒకరు కాదు. ఇద్దరనిపిస్తుంది. ఒక్కోసారి. నాకు తెలీనిదేదో నాలో ఉందనిపిస్తుంది. అది నాతో కొట్లాడుతుంది, నిలదీస్తుంది, అవమానిస్తుంది. ఎక్కడికెళ్తున్నానో తెలియని లోతులకి తీసుకెళ్ళి పడేస్తుంది. వెనక్కి రాలేక ఉక్కిరిబిక్కిరౌతున్న నా అసహాయతను చూసి నవ్వుకుంటుంది. నా భర్త అరుపు లాంటి బలమైన శక్తిని చూస్తే దానికి భయం. తెలియని చోటెక్కడికో పారిపోయి దాక్కుంటుంది. పిరికిది.
చటుక్కున తలెత్తి చూసేటప్పటికి హాల్లో లైటు వెలిగింది. ఇద్దరూ లోపలికొస్తూ సోఫాలో కూలబడ్డారు. “అలిసిపోయారు పాపం, ఎందుకింత కష్టపెట్టే ఉద్యోగాలు చెయ్యడం?” నా పిచ్చి జాలితనం. రెండు నిమిషాల్లో పైకి లేచింది ఆ అమ్మాయి. హాలు తలుపు తీసుకొని బాల్కనీలోకి వచ్చింది. తెల్ల స్లీవ్ లెస్ షర్ట్, ఎరుపు ప్యాంట్, సన్నని శిల్పంలా ఉంది. బాల్కనీ గ్రిల్ మీదకు వంగి ఎదురుగా చూస్తోంది. “నన్నేనా?” నా అనుమానం.
Reviews
There are no reviews yet.