స్వరాజ్య ప్రాప్తికై ప్రజలు నడిపిన ఉద్యమాలు, చేసిన తపస్సు, త్యాగాలు తలచుకొన్నప్పుడు తీవ్రమైన తలంపులు, స్మృతులు రేకెత్తుట సహజము. ఉదాత్తమైన ఆదర్శాలు , ఉచితమైన నడవడి, ఉత్తమమైన నాయకత్వము ఆ దినముల విశిష్టత. జన సముదాయ జీవితములో బంగారు పంటలు పండిన దినములవి. దేశభక్తి పెద్ద ఎత్తున విరోచితత్యాగా సంసిద్దతగా మారిన దినములవి. హింసారహితముగా అధికారపు శక్తిని ప్రతిష్ఠను నిర్భయముగా ఎదుర్కొన్నకాలమది.
అట్టి భారత జాతీయ మహోద్యమ చరిత్రను గూర్చి బాలబాలికలకు తెలియజెప్పు నుద్దేశముతో శ్రీ డి.రామలింగం గారు ఈ పుస్తకము వ్రాయుట అభినందింప దగిన విషయము. ప్రతి తరము వారికిని చెప్పవలసిన మహోజ్జ్వల చరిత్రమిది.
Reviews
There are no reviews yet.