మనం అంతు తెలియని ఆశ్చర్యాల విశ్వంలో బతుకుతున్నాం. దాని వయసు, పరిణామం, తీరు, అందాలను అర్థం చేసుకోవాలంటే అసాధారణమయిన ఊహాశక్తి అవసరం. ఈ విశాలమయిన కాస్మాస్లో మానవులనే మనం ఆక్రమించిన స్థానం చాలా తక్కువ అనిపించవచ్చు. అందుకే మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాము. అందులో మన స్థానం తెలుసుకోవాలి అనుకుంటున్నాము. కొన్ని పదుల ఏండ్ల క్రితం, ఒక పేరున్న సైంటిస్ట్ (కొందరు బెర్ట్రాండ్ రసెల్ అన్నారు) ఖగోళశాస్త్రం గురించి పబ్లిక్ లెక్చర్ చేశాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్న తీరు, సూర్యుడు, గెలాక్సీ అనే లెక్కలేని నక్షత్రాల గుంపు కేంద్రం చుట్టూ తిరుగుతుండడం, అన్నింటిని ఆయన వర్ణించాడు. ఉపన్యాసం ముగిసింది. గదిలో చివరన కూచున్న ఒక పొట్టి ముసలమ్మ లేచింది. “నీవు చెప్పినదంతా చెత్త. ప్రపంచం చదునుగా ఉంది. అది ఒక పెద్ద తాబేలు వీపుమీద ఉంది.” అన్నది. సైంటిస్ట్ పోనీలే అన్నట్టు నవ్వాడు. “మరి ఆ తాబేలు దేనిమీద ఉంది?” అడిగాడు. “తెలివి గల వాడివి, అబ్బాయ్, చాలా తెలివిగలవాడివి” అన్నది ముసలమ్మ. “ఒకదాని కింద ఒకటి అన్నీ తాబేళ్ల!” జోడించింది.
విశ్వం చిత్రాన్ని, అంతులేని తాబేళ్ల వరుసగా ఊహించడానికి, ఈ కాలంలో చాలా మంది అర్థం లేని మాట అంటారు. అయినా మనకేదో మరింత బాగా తెలుసు, అని ఎందుకు అనుకోవాలి? ఒక క్షణం పాటు స్పేస్ గురించి మీకు తెలిసినదంతా కనీసం తెలుసు అనుకుంటున్నదంతా మరిచిపోండి. అప్పుడిక రాత్రి ఆకాశంలో పరిశీలనగా చూడండి. ఆ వెలుగుతున్నవన్నీ ఏమిటవి? చిన్న చిన్న మంటలా? అవి నిజంగా ఏమిటో ఊహించడం కష్టం. వాటి తీరు మన మామూలు అనుభవాలకు అందని రకం. మీరు అదే పనిగా నక్షత్రాలను పరిశీలించే వారయితే, సంధ్యాసమయంలో, దిక్చక్రం మీద కొంత వెలుగు……………..
Reviews
There are no reviews yet.