మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్లభాషలో వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు.
కానీ నా తర్వాత తరం లో పుస్తకాలు చదవడం తగిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. ఆ ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.
2018 డిసెంబర్ ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెపిన ఒక సత్యం గుర్తొచ్చింది.
-వెంకట్ సిద్దారెడ్డి.
Reviews
There are no reviews yet.