ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతి, ప్రజాజీవన ధోరణి ప్రతిబింబించే కథ.
స్థలం కృష్ణానది తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.
ఆ ఊళ్లో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్లు – కాముని పున్నమ అని దవన పున్నమ అని ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరాసిన జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పోతుగడ్డ.
అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.
ఆమె వయసు మళ్లిన వాడ వదిన- ఆమెకు అందాలరాశి, భక్తికి వారాసి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్ని నేర్చిన చిరుజన. మువ్వను కవ్వించడం, మువ్వగోపాలుని నవ్వించడం ఆమె ఇష్టక్రియ.అమెకొక అక్క. పేరు చంచల.
Reviews
There are no reviews yet.