శివంగి
ఎదురుగా ఎటువంటి అడ్డంకి వున్నా, వెనుకా ముందూ చూసుకోకుండా ఎగిరి అవతలి పక్కకు దూకటం సమీరుడి అశ్వానికి వున్న పెద్ద అలవాటు.
కళ్ళేలను బిగించి పట్టుకున్నా, పళ్ళు బిగించి గట్టిగా అరిచినా, కొంచెంగా కూడా పట్టించుకోదు అది.
రాళ్ళు రప్పలు కాదు…దట్టమైన ముళ్ళ పొదలు ఇవి. కింద పడటం అంటూ జరిగితే కత్తులతో చీరినట్లు గాయాలు అవుతాయి. ‘జాగ్రత్తరా నాన్నా…’ మూడు బారల వెనుకగా తన వాహనాన్ని నడిపిస్తున్న సమీరుడి తండ్రి చిన్నగా హెచ్చరించాడు
సూర్యుడు పడమటి దిక్కుకి పడిపోతున్నాడు. పగటి సమయమంతా
శ్రాంతిగా తమతమ నెలవుల్లో పడుకుని వున్న జంతువులన్నీ వళ్ళు రుచుకుంటూ వేటలకు బయలుదేరే సమయం దగ్గరపడుతోంది.
మూడు క్రోసులుంది రహదారి… త్వరగా వెళ్ళకపోతే అడవిలో వుండగానే కటిపడిపోతుంది’ అంటూ కాలిమడమలతో తన అశ్వాన్ని కదిలించాడు మీరుడు. గట్టిగా సకిలించింది అది. అతని తండ్రి అనుమానపడుతున్నట్లుగానే ఎదుట న్న ఒక పెద్ద పొదమీద నుంచి ఎగిరి అవతలకి దూకింది.
Reviews
There are no reviews yet.