Sharadha Rachanalu

325.00

 

In stock

SKU: VPH0065 Category: Tag:
Author: Sarada

     “శారద” స్త్రీ కాదు పురుషుడు. తెలుగు తెలియని తమిళుడు. తీవ్రమైన దారిద్ర్యం, సుడిగాలుల్లో చిక్కుకొని ఎక్కడ్నుంచో కొట్టుకొచ్చి తెనాలిలో ఓ హోటలు కొమ్మకు చిక్కుకొన్న తెగిన గాలిపటం శారద. శ్రమజీవన సౌందర్యాన్ని కౌగిలించుకున్న సర్వర్. క్రమంగా తెలుగు నేర్చాడు. నుడులూ – నానుడులూ – జాతీయాలూ, పదవిన్యాసాలూ ఒడిసిపట్టి తెలుగువాళ్ళ గుండెను తట్టిన రచయితగా మారాడు. తెలుగుదనం నింపిన కలంతో తెలుగువారి జీవన సరళిని ఆపోశనపట్టాడు. కథాసాహిత్యంలోనూ, నవలారంగంలోనూ  స్థిరమైన స్థానం సంపాదించుకున్నాడు. అన్నిటినీమించి తన రచనలకు మార్క్సిస్టు తాత్వికతను ఎంచుకున్నాడు. వామపక్షభావజాల అభ్యుదయ రచయితగా నాటి యువరచయితలకు ఆదర్శప్రాయుడయ్యాడు.

1955 లో చనిపోయేంతవరకు అభ్యుదయ రచయితల సంఘంలో క్రియాశీలాపాత్ర పోషించాడు శారద ఉరఫ్ నటరాజన్. వీరి జీవితవిశేషాలు వివరించే ఓ వ్యాసం ఈ సంకలనంలో పొందుపరచాం. త్రిదశులుగా ఉన్న నేటితరంవాళ్ళకూ – కథాపథంలో ఇప్పుడిప్పుడే పారకాడుతున్న వర్థమాన రచయితలకూ శారద రచనలు ప్రస్తుతం అందుబాటులో లేవు. గతంలో కొందరు ప్రచురణకర్తలు శారద రచనలను ప్రచురించారు. వాటి వివరాలు క్లుప్తంగా ఈ సంకలనంలోని అనుబంధరచనలు వివరిస్తాయి.

Author Name

Sarada

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Sharadha Rachanalu”

Your email address will not be published. Required fields are marked *