Sarala Rekhalu

140.00

In stock

SKU: NAVAC005 Category: Tag:
Author: Papineni Shiva Shankar

సరళరేఖలు వక్రరేఖలు

అనంతవరం కొండ. కొండ మధ్య ఏటవాలుగా చిన్న గుహలాంటి చోటు. అక్కడ వెలసిన వెంకటేశ్వరస్వామి. ‘మీసాల వెంకన్న.’ అటు ఇటు శ్రీదేవి, భూదేవి. కొండపైకి మెట్ల దారి. దూరంనుంచి చూస్తే ఆ మెట్ల దారి తెల్లటి చారలాగా, ఏనుగు ఒంటిమీద విభూతి పట్టెలాగా కనపడుతుంది. కొండ లేదా గట్టు నాకెప్పుడూ ఒక మార్మిక ప్రదేశం. అనంతవరం కొండ మరీ. వాగు / వంక దొన అనంతారం అంటారు. కొన్ని మర్మాలు మనకెప్పటికీ తెలియవు.

ఫాల్గుణమాసంలో ఉగాదికి ముందు నాలుగు శనివారాలు అనంతారం గట్టుకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ఊళ్లనుంచి ఎడ్లబళ్లమీద, ట్రాక్టర్ల మీద జనం తండోపతండాలుగా తర్లి వస్తారు. ప్రభలు గడతారు. కోలాటాలాడతారు. చిన్నపాటి తిరణాలే. కనుచూపు మేర ఇసుకేస్తే రాలనంత జనం. సందడే సందడి. గట్టు పులకించి పోతుంది.

దేవుడున్నాడో లేడో నాకింతవరకూ తెలీదు. అయితే అనంతారం కొండ అనే మార్మిక ప్రదేశం నాకెంతో యిష్టం. ఇట్లా జనసందోహం మధ్యగా జనం లేని మామూలు రోజుల్లోను ఎప్పుడో ఒకప్పుడు కొండనెక్కటం నాకొక విచిత్రానుభూతి.

ఆ రోజు శనివారం. జనం రాపిడి మధ్య గోవిందనామ స్మరణం ప్రతిధ్వనుల మధ్య నేనూ కొండనెక్కాను. దైవదర్శనం ముగిసినా ఆ కోలాహలం చూస్తూ అక్కడే చాలాసేపు ఉండిపోయా. సాయంత్రానికి జన ప్రవాహం మెల్లగా ఇంకిపోయింది. కిందికి దిగే సెలయేరు మెల్లగా అదృశ్యమైనట్టు. కొండమీద కోనేరు నాకు మరో మార్మిక ప్రదేశం. గుడికి ఎడమ పక్కన చిన్న పెద్ద రాళ్ల మధ్యగా నడుస్తూ వెళితే కొంత దూరంలో పెద్ద బండల మధ్య దొన్నెలాగా ఉంటుంది. చిన్న కోనేరు. అది చూసి కొండ దిగిపోదామనుకున్నా.

సన్నటి కాలిదారి. నా ముందు వెనుక నలుగురైదుగురు యాత్రికులున్నారు. రాళ్లు రప్పల మీదగా జాగ్రత్తగా వెళ్లాలి. నా ముందొక చిన్న పిల్ల, అయిదారేళ్లుంటాయి. చిన్నతనపు ఉత్సాహంతో ఎరుగుతూ వెళుతుంది. కోనేది దగ్గర్లో పెద్ద రాయి ఎక్కబోతూ…………..

Author

Papineni Shiva Shankar

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Sarala Rekhalu”

Your email address will not be published. Required fields are marked *