ఉర్దూ కథ : శిరీస్ నియాజి
చిన్నచేప-పెద్దచేప
అదొక చీకటి రాత్రి! ప్రకృతి నలువైపులా నల్లటి దుప్పటి కప్పుకుంది. దూరాన ఉత్తర దిక్కులోని ఓ మూలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్టు ఎర్రబడింది. ఆకాశం,
పగలంతా తమ కువకువలతో సందడి చేసిన పక్షులు అలసిపోయి తమ గూళ్ళలో దూరి నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. కుక్కలు మొరగటం, ఏడ్వటం మానేసి రోడ్లు, సందుల్లో తమ కడుపుల్లో తలలు దూర్చుకుని నిద్రకు ఉపక్రమించాయి.
ఇలాంటి భయానకమైన రాత్రి ఓ నీడ తూలుతూ నది వైపు వేగంగా కదులుతోంది. అతని భుజాలు ముందుకు వంగి ఉన్నాయి. చిరిగిన దుస్తులు, అరిగిన చెప్పులతో అతను నడుస్తున్న తీరు చూస్తే అతనొక ముసలివాడని, బలహీనమైన వ్యక్తి అని ఇట్టే చెప్పొచ్చు. కాకపోతే కటిక పేదరికమే అతన్ని వయస్సుకన్నా ముందే ముసలివాడిగా మార్చేసింది. అయితే అలాంటి బలహీనమైన వ్యక్తి అర్ధరాత్రి పూట నది దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు?
పైగా ఈ రోజు సాయంత్రమే రేడియోలో ఒక హెచ్చరిక వెలువడింది- “ఈ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చే అవకాశముంది. అందువల్ల చేపలు పట్టే జాలరులు ఎవరూ నదిలోకి వెళ్ళకూడదు” అని. ఆ వార్త అనగానే ఆ జాలరి వెంటనే చేపల కాంట్రాక్టర్ దగ్గరికి ‘ఈ రోజు చేపలు పట్టలేనని చెప్పడానికి’ వెళ్ళాడు. ఆ మాట వినగానే కాంట్రాక్టర్ మండిపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్టాల్సిందేనన్నాడు. దాంతో తుఫాను రాత్రి అయినా చేపల కోసం నదిలోకి వెళ్ళక తప్పదనుకున్నాడు జాలరి. వెళ్ళకపోతే మరుసటి రోజు కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వడు. డబ్బు లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. తిండిలేక పిల్లలు విలవిల్లాడతారు. ఆకలిని తట్టుకునే వయసు వాళ్ళకింకా రాలేదు.
| ఓ పడవ నిండా పట్టిన చేపలకి కాంట్రాక్టర్ ఇరవై రూపాయలిస్తాడు. దాంతోనే అతను తనతోపాటు భార్య, ముగ్గురు కూతుళ్ళ కడుపులు నింపుతాడు. నిజానికి అతను పడే కష్టానికి ఇరవై రూపాయలు చాలా తక్కువ. కష్టం తనది, సుఖమూ, సొమ్మూ కాంట్రాక్టర్ ని అతనికి తెలుసు. చలిలో, వర్షంలో అవస్థలుపడి నదిలో చేపలు పట్టి నిజాయితీగా చేపలన్ని కాంట్రాక్టర్ కి చేరుస్తాడు. తన పిల్లల కోసం ఒక్క చేప కూడా తీసుకెళ్ళడు. అయినా కాంట్రాక్టర్ ఎన్నడూ అతనిపట్ల సానుభూతి చూపలేదు…………
Reviews
There are no reviews yet.