ఓ రైతు బేంక్ కి నగలతో వచ్చి అప్పు ఇవ్వమని కోరాడు. “ఎంత కావాలి?” బేంక్ మేనేజర్ అడిగాడు. “ఐదు లక్షలు సార్.” అతను జవాబు చెప్పాడు. “దాంతో ఏం చేస్తావు?” “ట్రాక్టర్ కొంటాను.”
అతనికి నిజంగా పొలం ఉందని రూఢీ చేసుకున్నాక మేనేజర్ ఆ నగలు తాకట్టు పెట్టుకుని అప్పిచ్చాడు. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఆ రైతు వచ్చి బాకీ తీర్చేసి బయటకి నడిచాడు. “ఆగండాగండి. మీ నగలు తీసుకెళ్ళరా?” మేనేజర్ అరిచాడు. “అక్కర్లేదు. అవన్నీ గిల్ట్ నగలేగా. ” ఆ రైతు చెప్పాడు.
***
మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన రేపో మాపో పెళ్ళంట నవల్లోని మనుషుల్లో చాలామంది ఆ రైతులాంటి నిజాయితీపరులు కారు. ఐనా వారు మిమ్మల్ని నవ్విస్తారు.
1997లో ఆంధ్రప్రభ దినపత్రికలో సీరియల్ గా వెలువడ రేపో మాపో పెళ్ళంట చిత్రవిచిత్రమైన పాత్రలతో, సన్నివేశాలతో, ప్రేమజంటలతో సాగుతూ, హాస్యాభిమానులని, ప్రేమ నవలల అభిమానులని సమానంగా ఆకట్టుకుంటుంది.
Reviews
There are no reviews yet.