Rendu Kommula Rushi

225.00

 

In stock

SKU: ALAKAN001 Category: Tag:
Author: Sudha Murthi

పరిచయం

వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలోని రామాయణ, మహాభారత, భాగవతాలను చదివి ఈ ఐదు భాగాల పుస్తకాలను రచించాను. అవి వేర్వేరుగా ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే మూలం ఒకే దారంగా అన్నింట్లోను కనబడుతుంది. పురాణాలలో పేర్కొన్న కొన్ని పాత్రలు వారి జీవిత కోణంలోంచి కథను చెబుతాయి. ఈ కథలలోని ప్రదేశాలు నేను దర్శించి అక్కడ చెప్పే కథల సారాంశాన్ని, సమాచారాన్ని అందించడం నా అదృష్టం,

పురాణాల్లోని వివిధ అంశాలను సేకరించి వ్రాసిన ఐదు పుస్తకాలలో ఇది చివరిది. ప్రతి పుస్తకం మరో పుస్తకంతో సంబంధం లేనిదైనా దేనికదే వివరంగా ఉంటుంది. నేను వ్రాయలేక వదిలేసినవి అనేక కథలున్నాయి. ఈ పుస్తకం చదివి మీరు స్ఫూర్తిని పొంది మిగిలిన కథలు మీ అంతట మీరే చదువుతారని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకాలు రాసేటప్పుడు నా సంపాదకురాలు శృతకీర్తి ఖురానా నాకు సహకారం అందించింది. నేను పరిశోధన చేసేటప్పుడు జీవితం, ఆధ్యాత్మికత గురించి, పుస్తకాల గురించి అనేక లోతైన చర్చలు జరిపి మమ్మల్ని మేం తెలుసుకున్నాం. మా అనుబంధం సంపాదకురాలు – రచయిత కన్న ఎక్కువది. అనేక విధాలుగా ఆమె నాకు కూతురు, మరిన్ని రకాలుగా ఆమె నా విద్యార్థి, నేను చేపట్టే వితరణ కార్యక్రమాలలో చిరకాల సలహాదారు. మేం చేసే వినోదభరిత సంగీత సాహిత్య సాహసయాత్రలో నాతోబాటు ప్రయాణించిన యువనేస్తం.

పెంగ్విన్ రాండంహౌస్ లోని సోహిని మిత్రా, షాలిని అగర్వాల్, ప్రియంకర్ గుపా బృందం ఐదు పుస్తకాలు అందించడానికి ఇచ్చిన తోడ్పాటుకు, తెలుగులో తీసుకువచ్చిన అలకనంద ప్రచురణలకు నేను కృతజ్ఞురాలిని…………….

  

Author Name

Sudha Murthi

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Rendu Kommula Rushi”

Your email address will not be published. Required fields are marked *