ఈ నవలంతా చదివిన తర్వాత.. ఒక కష్ట స్వాతంత్ర్యం ఏమిచ్చింది? గత దశాబ్దాలలో స్వతంత్రం ఎవరి ప్రయోజనాలను కాపాడింది? ఎవరి ప్రయోజనాలను గాలికొదిలేసింది? ఇలాంటి ప్రశ్నలు అనేకం మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. స్వాతంత్ర్యనంతరం జరిగిన అభివృద్ధిగా పాలకులు పేర్కొంటున్న అభివృద్ధి ఎలాంటిదో ఆలోచించమని ఈ నవల వినయంగా పాఠకులను కోరుతుంది. వలసపాలన మొదలవడంతో ప్రారంభమైన వృత్తుల విధ్వంసం ప్రపంచీకరణతో పరిసమాప్తమౌతున్న నేపథ్యంలో ఈ నవల రావటం కాకతిళీయం కాదు.
– రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అన్నగుడ్డ సానరాయి వంటి కథల్లో సంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కలభూమికపైనా మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు… ఈ నవల రాజకీయాల గురించి వర్గపోరాటాల గురించి పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే ఈ దురన్యాయానికున్న సాంఘిక ఆర్థిక రాజకీయ నేపధ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది.
– మధురాంతకం నరేంద్ర
Reviews
There are no reviews yet.