చిమ్మ చీకటి, వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంనిండా చుక్కలు గుతులుగా వేలాడుతున్నాయి. అర్ధరాత్రి దాటుతోంది. పడవ చప్పుడులేకుండా రొయ్యల చెరువులో కదులుతోంది. ఇద్దరి నల్లటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఏసు ఫాన్లెట్ వేసి నీటిపైన చూస్తున్నాడు. గన్లో తుపాకీమందు, రవ్వలుకూరి, గురిపెట్టుకొని చూస్తున్నాడు విజో. సైగచేశాడు విజో. పడవ ఆగిపోయింది. చిన్నగా ఈల లైటు ఆరిపోయింది, తుపాకీ పేలింది. రవ్వలు దూసుకు పోయాయి. ఇప్పుడు లైటు వేసి ఆచోటంతా వెతికారు, రెండు బుడబుచ్చకాయిలు తేలాయి. మరో కొంతసేపు వేట సాగింది. మరో మూడు పిట్టలు దొరికాయి, “ఈరోజుకు చాలు, మరో రెండు రోజుల్లో రాత్రివేట చేద్దాం” అన్నాడు విజో.
ఉదయానికి ఈ చంపిన పిట్టల్ని చూపిస్తే యజమాని సాయిరాజు సంతోషపడతాడని విబ్రోకి అనిపించింది. మరి ఈ వేటకోసమే విప్రోని తీసుకువచ్చింది. రొయ్యల చెరువుల్లో ఎన్నో సమస్యలు అవన్నీ సాయిరాజు చూసుకోగలడు కాని ఈ పిట్టల సంగతి తానే చూడాలి..
బుడబుచ్చకాయిలు, నీటిమీద వాలే చిన్నపిట్టలు. మహా అయితే
పిచ్చుకల కంటే కొంచెం పెద్దవి. బాతుపిల్లల సైజులో ఉంటాయి. ముదురు, లేత గోధుమరంగులలో ముదొస్తూ ఉంటాయి. నీటిమీద తేలుతూ, మధ్యమధ్యలో నీటిలో మునిగి ఓనిమిషం ఉండి, ఎదో ఒక చేపపిల్లో రొయ్యపిల్లనో నోట……….
Reviews
There are no reviews yet.