ముందే చెపుతున్నాను స్మీ. ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించి నట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు. ఈ పుస్తకం ‘స్నేహం- ఆప్యాయత – ప్రేమ – మోహం – దాంపత్యం – రొమాన్స్- అనుబంధం’ అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది.
ఇందులో:
స్నేహం: స్నేహంలోంచి ప్రేమలోకి… స్నేహితుల్లో రకాలు… అకస్మాత్తుగా గుడ్ బై చెప్పే స్నేహితులు… ఖరీదైన స్నేహాలు… మంచి స్నేహితుడి పది లక్షణాలు… స్నేహం స్వార్థమా?… ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి?
ప్రేమ: తూపు తొలి చూపు… తొలి స్పర్శ… పప్పీ లవ్… పెళ్ళికి ముందు ప్రేమ… ప్రేమ వివాహాలు… పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు… ప్రేమలో ఎమోషన్స్… ప్రేమ – ఈర్ష్య.
దాంపత్యం: ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే… లివ్ – ఇన్ – రిలేషన్… సెకండ్ సెటప్… సర్దుబాటు.
శృంగారం: వద్దనకు ఈ ముద్దు… రోమాన్స్… వాత్సాయన… విరహ వర్ణన… శృంగారానికి ఆరు మెట్లు.
అనుబంధం: మూడు రకాల అనుబంధాలు.
– యండమూరి వీరేంద్రనాథ్
Reviews
There are no reviews yet.