Pillala Kosam Philosophy

150.00

In stock

SKU: EMESCO0015 Category: Tag:
Author: Sundar Sarukai

మీ తరగతి గదిలో మీ ముందు ఒక కుర్చీ ఉందనుకోండి. అది అక్కడుందని మీకెలా తెలుసు, మీరు దాన్ని చూడగలరు కాబట్టి, మనందరం అక్కడ కుర్చీ ఉందనుకుంటాం, ఎందుకంటే మనందరం దాన్ని చూడగలం కాబట్టి.

కాని మీరు చూస్తున్న దేమిటి? మీరు కుర్చీరంగు చూస్తున్నారా? ఆకారం చూస్తున్నారా? ఒకేసారి రంగూ, ఆకారమూ కూడా చూస్తున్నారా?

మీ మిత్రుడు కూడా కచ్చితంగా మీరు చూస్తున్నట్లే కుర్చీని చూస్తున్నాడని మీకెలా తెలుసు? ఆ కుర్చీ మీకందరికీ ఒకేలా కన్పిస్తున్నదని మీకెలా తెలుసు? |

ఒకవేళ మీరు కుర్చీకి ముందు కూర్చున్నారు, మీ స్నేహితురాలు కుర్చీకి వెనక కూర్చుంది. అనుకోండి. మరి మీరు చూస్తున్న దానికీ, మీ స్నేహితురాలు చూస్తున్న దానికీ భేదమేమైనా ఉందా?

మీరు కుర్చీని వేరువేరు వైపులనుండి, వేరు వేరు దూరాల నుండి చూస్తున్నారనుకోండి. మీరు కుర్చీని చూసిన ప్రతిసారీ చూసే పద్ధతి మారుతుందా? మీరు కుర్చీని రాత్రివేళ చూస్తే అది వేరుగా కనిపిస్తుందా?

ప్రతిసారీ కుర్చీ వేరుగా కనిపిస్తూంటే మీరు అదే కుర్చీని చూస్తున్నారని మీకెలా తెలుస్తుంది? ఇది ఆలోచించండి. మీరు వేరే వేరే చోటు నుంచి చూసినప్పుడల్లా మీరు కొత్త కుర్చీని చూస్తున్నారా? అలాకాకపోతే వెలుతురులో తేడా ఉన్న వేరు వేరు కోణాలనుంచి చూసినా వేరువేరుగా కనిపిస్తున్నప్పుడు అది అదే కుర్చీ ఎందుకవుతుంది? ఇదంతా ఒక కుర్చీ విషయంలో మాత్రమే. మీ జీవితం గురించి ఆలోచించండి. మీరు పుట్టినప్పుడు మీరు నిజంగా చాలా చిన్నగా ఉన్నారు. మీరిప్పుడు కనిపిస్తున్నట్లు అప్పుడు కనిపించలేదు. మీ ఎత్తు, బరువు, మీరు చేసే పని, మీరు మాట్లాడే భాషలు ఎంతో మారిపోయాయి. మీ జీవితంలో ప్రతి సంవత్సరం మీలో మార్పు ఉంటుంది. మరి ఎప్పుడో సంవత్సరాల కిందట మీరు పుట్టినప్పుడున్న పసిబాలుడేనని ఎందుకు నమ్ముతున్నాం?

Author

Sundar Sarukai

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Pillala Kosam Philosophy”

Your email address will not be published. Required fields are marked *