“ఊరు కనబడుటలేదు” కథా సంపుటిలో అన్ని కథలలో మన చుట్టూ ఉన్న మనిషి కనబడతాడు. మనం పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని వెతికి పట్టుకోవడానికి, మనం చుట్టూ నిర్మించుకున్న గోడల్ని పగలగొట్టుకునేందుకు ఈ కథలు పనికొస్తాయనడం అక్షరసత్యం. సంగీతాత్మక శైలితో, సమాజంలోని వస్తున్న తిరోగతి మార్పులను ఒడిసిపట్టి, మనిషిపై వాలుతున్న పీడనీడను పారద్రోలడానికి మనిషిని మనందరివాడుగా, మంచితనానికి చుట్టంలా మార్చడానికి చేసిన ప్రయత్నమే ఈ కథా సంపుటి.
కథానికా శిల్ప రహస్య మర్మాలు బాగా గుర్తించి అలవర్చుకుని కథానిక భాష సముచితంగా, సందర్భ సహితంగా ఉన్నది. చిన్న చిన్న పదాలతో వాక్యాలతో విశేష అర్థం ఆవిష్కరింపజేస్తూ నన్ను నాకు గుర్తుచేశారు.
– పద్మశ్రీ డా కొలకలూరి ఇనాక్
తన చుట్టూ ఉన్న వ్యక్తులనీ, వాళ్ళ ప్రవర్తననీ ఈయన నిశితంగా పరిశీలిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు. ఈ లోకంలో ఇంత అన్యాయం ఎందుకుందని లోపల ఆవేదన చెందుతున్నారు. పీడితుల పట్ల సహానుభూతి ఉంది. స్పందించే హృదయముంది. ఈయన ఎన్నుకున్న కథా వస్తువులతో ఈ విషయం స్పష్టమవుతుంది.
– ముక్తవరం పార్థసారథి
‘ఊరు కనబడుటలేదు’ లోని కథలలో ఎక్కువగా మధ్యతరగతి మనస్తత్వాలను, జయాపజయాలను, అట్టహాసాలను, అవమానాలను, ఆలోచనలను చివరికి వారి తాత్త్వికతను సైతం చిత్రించే ప్రయత్నం కనిపిస్తుంది. ‘ఊరుకనబడుటలేదు’ ‘ఒంటెద్దు బండి’ వంటి ఉత్తమ శ్రేణి కథలు ఇందులో ఉన్నాయి. ఇతని శైలికి లయ ఉంది. అది సంగీతాత్మకంగా ఉంది.
– డా వి ఆర్ రాసాని
Reviews
There are no reviews yet.