Oorikoiah Anchu Nundi

150.00

In stock

SKU: MALUPA001 Category: Tag:
Author: A G Perarivalan

ఈ పుస్తకం ఇప్పుడెందుకు?

1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు గురయిన విషయం తెలిసిందే. అందులో పాల్గొన్నవారిని ఘటనా స్థలంలోనే చంపేశారు. మరికొందరు ముఖ్యులు సైనైడ్ మింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరిని అరెస్టుచేసి కొందరికి మరణశిక్ష, మరికొందరికి యావజ్జీవకారాగార శిక్షలు వేశారు. 1991 జూన్ 11న అరెస్టయిన ఏ.జి. పేరరివాలన్ మరణశిక్ష పడిన ఏడుగురిలో ఒకరు. అతను 19 యేళ్ళ వయసులో జైలుకు వెళ్ళాడు. 9 వోల్టుల బ్యాటరీ సెల్ కొని శివరాసన్ కి ఇచ్చాడని అతనిపై ఆరోపణ. ఆ బ్యాటరీని రాజీవ్ హత్యలో ఉపయోగించిన బాంబును పేల్చడానికి ఉపయోగించారని కాబట్టి పేరరివాలన్ కు కుట్రలో భాగస్వామ్యం ఉందనీ 1998లో టాడా కోర్టు అతనికి మరణశిక్ష వేసింది. ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేసుకొనే అవకాశం లేనందున అతను తనకు వేసిన మరణశిక్ష గురించి సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి | చేశాడు. టాడా కోర్టు వేసిన శిక్షను 1999 లో సుప్రీంకోర్టు ఖరారు చేసింది. కానీ ఈ శిక్ష అమలుకాలేదు.

పదిహేనేళ్ళ తరవాత 2006లో అతను మళ్ళీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ విజ్ఞప్తిలో అతను, ఏ సాక్ష్యాల ఆధారంగా తనకు కోర్టు మరణశిక్ష విధించిందో అదే సాక్ష్యాలను, తీర్పులోని భాగాలను విస్తారంగా ఉటంకించి, తనకు వేసిన శిక్ష ఎలా సరైంది కాదో నిరూపించాడు. పేరరివాలన్ తదితరులను విడుదల చేయాలని, కరుణానిధి నుండి స్టాలిన్ వరకు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలలో తీర్మానాలను కూడా ఆమోదించారు. అతనికి మద్దతుగా కొందరు ప్రజాస్వామిక వాదులూ, విశ్రాంత న్యాయమూర్తులు, రాజకీయ నాయకులూ రాష్ట్రపతికి విజ్ఞప్తులు చేశారు. ఈ పుస్తకంలో పరరివాలన్ రాసిన విజ్ఞపులతో పాటు అవన్నీ కూడా ప్రచురించారు. ఈ పుస్తకం | ముదట తమిళంలో జులై 2006 లోనూ, తరవాత దీనికి ఇంగ్లీష్ అనువాదం డిసెంబర్ 1 2006 లోనూ అచ్చయ్యాయి. అతనితో పాటు మరణశిక్ష పడిన వారందరికి మరణశిక్షను………..

Author

A G Perarivalan

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Oorikoiah Anchu Nundi”

Your email address will not be published. Required fields are marked *