ఒక్కమాటలో చెప్పాలంటే లలిత కిచ్చిన మాటకోసం. లలిత “నా జ్ఞాపజాలు’ పేరుతో తన జీవిత విశేషాలురాసింది. “మీరురాయాలండి, మీ జ్ఞాపకాలు విస్తృతమైనవి, విభిన్నమైనవి” అని అంటుండేది. నా పై తనకున్న ప్రేమాభిమానాలు మాత్రమే కాదుఅలా అనడానికి,నా అనుభవాలు అనేకానేక విషయాలను ప్రస్తావిస్తాయనీ, అవి ఆయా సందర్భాల్లో జరిగిన విశేషాలను తెలియచేస్తాయనికూడా కావచ్చు.
జీవితంలోనేను సంపాదించుకొన్నవెలకట్టలేని సంపద అనేకులైననా మిత్రులు,శ్రేయోభిలాషులు,పరిచయస్తులూను. వీరిపరిచయంతోపాటు వారిచ్చిన ప్రోద్బలం నాకు ఊతమిచ్చి నన్ను నడిపించింది. నన్ను నేను సమర్థించుకోవడానికి,ఇదిచెపుతున్నానని అనుకొన్నా,ప్రతి వ్యక్తికీ తన్ను గూర్చి చెప్పుకోవాలన్న ఆసక్తి వుండడం సహజం. ఇది బలహీనతా? కాదనను.మినహాయింపులుండవచ్చు.
వ్యక్తిగతజీవిత చరిత్రల పొరల్లో దాగి, పరిసరాల, ప్రాంతీయ, దేశ చరిత్రల ఆనవాళ్లువుండ స్వీయజీవితచరిత్రకారుడు వీటినితన ‘కథ’లో స్పృశించడా?
జీవితచరిత్రలు,ఆయావ్యక్తుల,వారి,వారిజీవితాలనువాస్తవంగా, అరమరికలు, దాపరికాలులేకుండాప్రతిబింబిస్తాయా? అందరూ’మహాత్ములు’ కారు,కాలేరు.అలాంటప్పుడుఅవినికార్సయిన రచనలు అవుతాయా? ప్రతి జీవితచరిత్రకారుడునిజాయితీగాఎదుర్కొనే ప్రశ్నలుయివి!
Reviews
There are no reviews yet.