‘నా భారతదేశం: భవితకు సూచనలు’ అనే గ్రంథం డా ఎ పి జె కలాంగారి రాష్ట్రపతి పదవీవిరమణ తర్వాతి ఉపన్యాసాల నుండి గ్రహించిన సారాంశాల సంకలనం. డా కలాంగారు భారతదేశంలోనే కాక, విదేశాలలోనూ పలు పార్లమెంట్లు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో చేసిన ఉపన్యాసాల నుండి సంగ్రహించిన ఈ భాగాలలో, విజ్ఞానం, దేశ నిర్మాణం, పేదరికం, కనికరం, ఆత్మవిశ్వాసాలపై వారి అభిప్రాయాలు క్రోడీకరించబడ్డాయి.
స్థిరచిత్తం గల మహానుభావులైన మేరీ క్యూరీ, డా విక్రమ్ సారాభాయి వంటి వారి జీవితాలను, డా కలాం యువనాయకులను ప్రోత్సాహపరిచేందుకు, స్పూర్తినిచ్చేందుకు ఉదాహరించారు. ఈ ఉపన్యాసాలు ద్వారా చెప్పిన ఎన్నో విలువైన పాఠాలను వినమ్రత, ఎదురుతిరగడం, దృఢనిశ్చయం.. తదితర విషయాలపై చెప్పడం, పిల్లలు ఆలోచించడం, ఎదగడం, వికసించడానికి తోడ్పడతాయి.
డా కలాంగారి ఆఖరి పుస్తకం వారి మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రాజెక్టు. అది ప్రతి పిల్లవాడికీ మార్గదర్శనం చేసి, వారి కలలను అన్వేషించేందుకు, ఉత్తమపౌరులుగా ఎదగడానికి, మరింత మేలైన భారతదేశాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.
Reviews
There are no reviews yet.