మున్నీటి గీతలు
సందెకాడ సూరీడు అందగాడినన్నాడు….. కొండచాటు నుంచి కొంగుచాటుదాక వచ్చాడోయమ్మా… వెలుగుతోటలో అగ్గిపూలనే పూయించాడమ్మా…..
మెత్తని ఎదలో పచ్చని ఆశలు రగిలించాడమ్మా…. పారవశ్యంతో కళ్లు మూసుకుని పాడుతున్నాడు జముకుల గరటయ్య. రాగం కూడా తీస్తున్నాడు.
డురుడుక్కు.. డురుడుక్కు.. డురుడుక్కు…
డ్రు డ్రు డ్రు డ్రు….
చేతుల్లోని జముకు వాద్యాన్ని చిత్రమైన శబ్దాలు వెల్లువెత్తేలా మోగిస్తున్నాడు.
అయితే అక్కడున్న పుంజీడుమందికీ ఆ పాట ఆ మోత అస్సలు నచ్చడం లేదు. మాడిపోయిన అరిసెల్లా కనిపిస్తున్న వాళ్ల మొహాలనుబట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు.
గరటయ్యకి ఇదేం బోధపడలేదు. నేత్రాలు మూతలేసుకుని రాగప్రస్తారాలు చేస్తూనే ఉన్నాడు.
కాబట్టే, అసహనం ముంచుకొస్తుండగా నిలుచున్న కిళ్లీ బడ్డీచోటు వదిలి పెట్టి పుక్కళ్ల ఎల్లారావు కదిలాడు. గరటయ్య దగ్గరసా నాలుగు అడుగులు విసవిసా వేశాడు. సరం తీగ చుట్టుకున్న మువ్వల కోలమీద చెయ్యివేశాడు. అదిమి పట్టేశాడు. జముకు ఆగిపోయింది. గీతం మలిగిపోయింది. ధ్వని నిలిచిపోయింది.
కంగారుపడి రెప్పలు తెరిచాడు గరటయ్య. ఎల్లడివైపు తీక్షణంగా చూశాడు.
“అదేంటి తండ్రీ! అడసుడిగా ఆపీసేవు, వీలయినంత మృదువుగానే అడిగాడు.
వెర్రెక్కిపోయినట్టయ్యాడు ఎల్ల. ………….
Reviews
There are no reviews yet.