Modi@20 Enllu Swapnichadu Sadhinchadu

300.00

In stock

Author: G Valliswar

                                                                  22 కలాల సంగమం – ఈ సంకలనం

ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్యాల మౌలిక లక్షణం వాదోపవాదాలు, స్పర్ధలు. రాజ్యాంగం వల్ల లభించిన వాక్స్వాతంత్య్రం, స్వతంత్రంగా పనిచేసే మీడియా, న్యాయవ్యవస్థలు, మహా చైతన్యభరితమైన పౌరసమాజం – వీటితో కూడిన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థలో అయితే ఈ స్పర్ధ మరీ ఎక్కువ. ఎందుకని? ప్రతి ఒక్కరికీ నిర్భయంగా తాను చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అవకాశం ఉంటుంది కదా! అలాంటప్పుడు భారతదేశం గురించి చెప్పేదేముంది?

కొన్నివేల సంవత్సరాల చరిత్ర, సమాంతర చర్చావేదికలు, వైవిధ్యభరితమైన భావప్రవాహాల పరంపర కలిగిన భారతదేశం అలాంటి స్పర్థల ప్రపంచంలో శిఖరస్థాయిలో ఉంది ఇప్పుడు. దీనికితోడు, వందకోట్లు దాటిన జనాభా! రాజకీయాలతో పాటు గణనీయమైన పరిమాణంలో చురుకైన యువత, విభిన్న భాషలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు నిండివున్న భారతదేశపు జటిలమైన స్వరూపాన్ని ఒక్కసారి ఊహించండి. ఇలాంటిదేశంలో ఏదో ఒక (రాజకీయ) సిద్ధాంతం లేదా విధానం మాత్రమే కేంద్రబిందువుగా ఈ వ్యవస్థను దీర్ఘకాలం నడిపించటం దుర్లభం!

కానీ, అలాంటి ఒక విధానం – ‘మోదీ తత్త్వం’ – ఈ అతి పెద్ద ప్రజాస్వామిక దేశంమీద రెండు దశాబ్దాలపాటు తన ముద్ర ఒకటి బలంగా వేసింది. దేశ అభివృద్ధే లక్ష్యంగా ‘మోదీ తత్త్వం’ 21 వ శతాబ్దంలో భారత్ స్వరూప స్వభావాలను పునర్నిర్వచిస్తోంది. తీర్చిదిద్దుతోంది.

పశ్చిమ భారత్ లోని గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ పదవీబాధ్యతలు స్వీకరించారు. అంటే 2021 నాటికి – ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వవస్థలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పన్నెండున్నర సంవత్సరాలు, దేశ ప్రధానమంత్రిగా ఏడున్నర సంవత్సరాల పైన – రెండు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగారు మోదీ. ఇది ఈ దేశచరిత్రలో సాటిలేని పరిణామం. దీనికి సామ్యాలు ఇతర ప్రజాస్వామిక దేశాల్లో ఉండవచ్చు. కానీ భారత్లో మాత్రం ఇదే ప్రథమం.

ఈ 20 సంవత్సరాల కాలంలో మోదీ మొత్తం అయిదు సాధారణ ఎన్నికల్లో పోటీచేశారు. అది కూడా స్వతంత్రంగా కాదు. గుర్తింపు ఉన్న ఒక పార్టీగుర్తు మీద పార్టీ అభ్యర్థిగా, ఆ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోందో అన్న ప్రశ్నతోనే మొదలవుతూ వచ్చాయి. అలా ఆయన 2002, 2007, 2012 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ‘ముఖ్యమంత్రి……………

Author

G Valliswar

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Modi@20 Enllu Swapnichadu Sadhinchadu”

Your email address will not be published. Required fields are marked *