డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి వైద్య సాహిత్య రంగాలలో సుప్రసిద్ధులు. గైనకాలజీ మరియు ఆబెట్రిక్స్ నిపుణులైన వీరు కాకినాడలో “విజయలక్ష్మి నర్సింగ్ హోమ్” ప్రారంభించి గత 38 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనే కాక, సాహిత్య రంగంలో కూడా ప్రసిద్ధి గాంచిన వీరి రచనలు – “మీరు ప్రేమించలేరు”, “మాకీ భర్త వద్దు”, “పేషంట్ చెప్పే కధలు”, “జ్వలిత” – కధానికా సంపుటాలు : ‘సజీవ స్వప్నాలు’, ‘చైతన్య దీపాలూ’, ‘ప్రత్యూష పవనం’, ‘వెలుతురు పువ్వులు’ – నవలలు : ‘మన దేహం కధ’, ‘కౌమార బాలికల ఆరోగ్యం’ – వైద్య పరిజ్ఞానానికి సంబంధించిన రచనలు : ‘వైద్యడు లేని చోట’, ‘మనకు డాక్టరు లేని చోట’, ‘రక్తం కధ’ – అనువాదాలు ఉన్నాయి.
‘డా. ఆలూరి విజయలక్ష్మి రచనలు’ అను అంశంపై నాగార్జున యూనివర్సిటీ తెలుగు విభాగం విద్యార్ధిని పరిశోధనా పత్రాన్ని సమర్పించి ఎమ్.ఫిల్. డిగ్రీ పొందారు.
డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి అనేక సుప్రసిద్ధ సాహితీ సంస్థల నుండి, సామాజిక సంస్థలనుండి ఎన్నో సాహితీ పురస్కారాల్ని, సామాజిక సేవా పురస్కారాల్ని పొందారు.
తెలుగు పాఠకులకు డాక్టర్ విజయలక్ష్మిగారు ఇచ్చిన మరో వినూత్న కానుక – ‘మాతృత్వం : ప్రసూతి సమస్యలు – సలహాలు’. ఈ పుస్తకం గతంలో అశేష పాఠకుల ఆదరణపొంది పలు ముద్రణలు పొందింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది మరెన్నో మార్పులు, చేర్పులతో కూడిన పరిస్కృత ముద్రణ.
– ఆలూరి విజయలక్ష్మి
Reviews
There are no reviews yet.