నేను రాసేవి, “మార్క్సిజం” నుండి నేర్చుకున్న భావాలతోనే. “మార్క్సిజం” అంటే, సమాజంలో ఉన్న మానవ సంబంధాల గురించి వివరించే సిద్ధాంతం. ఈ సంబంధాలలో, పురుషులకూ – పురుషులకూ మధ్య గానీ, స్త్రీలకూ – స్త్రీలకూ మధ్య గానీ, స్త్రీలకూ – పురుషులకూ మధ్య గానీ, సాంఘికంగా అనేక భేదాలు ఉన్నాయి. ఆ బేధాల్ని “వైరుధ్యాలు” అనే దృష్టితో అర్థం చేసుకుంటే తప్ప, సమాజాన్ని అర్థం చేసుకోలేము.
మానవ సంబంధాల రహస్యాల్ని మార్క్సు నుండి తెలుసుకోవలసిందే! ఎంగెల్స్ తో కలిసిన మార్క్సు నుండి! వేల సంవత్సరాల నాడు బానిస యజమానుల ద్వారా మొదలైన ఆ రహస్యాన్ని! ఏనాడైనా బానిసల్ని పోషించింది యజమానులు కారు, యజమానుల్ని పోషించింది బానిసలే! బానిసల తరాల తర్వాత, ఆ పోషకులు, కౌలు రైతులే; వారితో పాటు, వేతన కార్మికులు కూడా! యజమాని వర్గం చేసే ఘోర నేర అయిన ‘శ్రమ దోపిడీ’ యే, మానవ సంబంధాల నిండా పేద- ధనిక భేదాల మూలకారణం! ఆ మూలమే, మరిన్ని అనేకానేక అసహజ సంబంధాల్ని కూడా పుట్టించి నిలబెడుతోంది! సమస్య వెంట పరిష్కారం ఉంటుంది. కానీ, బాధితులు సమస్యని గ్రహిస్తేనే! విముక్తిని కాంక్షిస్తేనే!
Reviews
There are no reviews yet.