Marx- Ambedkar Manava Vimochanaa Drukpadhalu

100.00

In stock

Author: Anad Teltumbde

మార్క్స్, అంబేడ్కర్లు మానవ విమోచనను ఎలా అవగాహన చేసుకున్నారు. దానిని సాధించ డానికి వారు ఎలా కృషి చేశారు అనే విషయాలను వివరించడానికి ఆనంద్ తేల్ తుంబ్లే తన రచనల్లో ప్రయత్నించారు. అంబేడ్కర్ లోని విమోచనా దృక్పథం బౌద్ధంతో ముడిపడివున్నందున మానవ విమోచన పట్ల బౌద్ధ దృక్పథాన్ని కూడా రచయిత పరిశీలించారు. –

పౌర, రాజకీయ సాధననే సంపూర్ణ విమోచనగా, ఉదారవాద ఆలోచన పరిగణించింది. దానిని మార్క్ దాటి వెళ్ళారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అధిగమనానంతరం కమ్యూనిస్టు సమాజంలో మానవసారమైన సామాజికతని మనిషి తిరిగి పొందడాన్నే విమోచనగా మార్క్స్ పరిగణించాడు. ఈ సైద్ధాంతిక అవగాహనతోను, దాని ఆచరణలోను వచ్చిన సమస్యలను కూడా ఆనంద్ తేల్ తుంబ్లే పరిశీలించారు.

మార్క్స్, అంబేడ్కర్ల అవగాహన మానవ కేంద్ర దృష్టితో ఉన్నదని ఆనంద్ తేల్ తుంబ్లే అభిప్రాయపడ్డారు. అయితే బౌద్దానికి క్రియాశీల పార్శ్వం లేనందువల్ల నిర్వాణాన్ని వ్యక్తి కేంద్రకంగా చూడడం వల్ల అది ఒక నెరవేరని ఆదర్శంగా మిగిలిపోతుందని రచయిత అభిప్రాయం. మార్క్సిజంలో సైద్ధాంతిక, ఆచరణాత్మక సమస్యలు ఉన్నప్పటికీ, ఒక శాస్త్రీయ పద్ధతిగా మార్క్సిజం వాటిని సరిచేసుకోగలదని తేల్ తుంబ్లే అభిప్రాయపడ్డారు. –

Author

Anad Teltumbde

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Marx- Ambedkar Manava Vimochanaa Drukpadhalu”

Your email address will not be published. Required fields are marked *