‘హిందీ కథా సాహిత్యంలో సామాజిక నవలని వృద్ధిపరిచిన రచయితలలో యశ్ పాల్ కృషి అద్వితీయమైనది’ అని హిందీ సాహిత్యంలో అగ్రగణ్యులు కీర్తించారు. ప్రేమ్ చంద్ తన కృషిని ఎక్కడైతే వదిలిపెట్టాడో, యశ్ పాల్ తన కృషిని అక్కడి నుండే ప్రారంభించాడని కూడా సాహిత్య ఉద్దండులు కొనియాడారు. ప్రజల చైతన్యాన్ని పెంచడం ద్వారా సామాజిక మార్పుకు బాటలు వేయాలనీ, ప్రత్యేకించి మధ్యతరగతి బుద్ధి జీవులను ఆ బాటలో పయనించేటట్లుగా తన సాహిత్య కృషిని యశ్ పాల్ కొనసాగించాడు. మత కల్లోలాలు, వాటి దుష్ఫలితాలను నవలా రూపంలో యశ్ పాల్ గొప్పగా చిత్రీకరించాడు. మతోన్మాదుల స్వార్థాన్ని, వారికి రాజకీయ నాయకుల అండదండలనూ తన నవలల ద్వారా ఎండగట్టాడు. మనిషి రూపాలు అనే ఈ నవల నేటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి గొప్పగా ఉపకరిస్తుంది. పాఠకులను ఆకట్టుకునే రీతిలో నవల నడక సాగుతుంది.
– గడ్డం కోటేశ్వరరావు
Reviews
There are no reviews yet.