నా కథల్తో పాటు…
C
‘గతంలో, అంటే అరవై ఏళ్ళ క్రితం జన జీవితంలో ఇంతటి విపరీత వేగం లేదు. స్థిరత్వం, స్తిమితం ఉండేవి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు పట్టించు కోటం ఎక్కువగా ఉండేది. విలువల్లో మార్పు రావటానికి చాలాకాలం పట్టేది. మెజారిటీ జన అభిప్రాయం అంటూ ఒకటి బలంగా ఉండేది. ఎవరైనా అనుభవంతో ఏదైనా చెపితే చాలామందికి నచ్చేది. ఎక్కువ మంచితనం, దానికన్నా తక్కువగానే చెడుతనం ఉండేవి. అన్ని వయసుల వాళ్ళలో సంతోషం కనిపించేది.. ముఖ్యంగా వృద్ధుల్లో,
పిల్లల్లో, ఎవరేనా ఇంటికి వస్తే, ఆ కలిసి మెలిసి గడిపే జీవితం పండుగలా ఉండేది. ఇరుగు పొరుగు, బంధువులకన్నా దగ్గరగా ఉండేవారు. అధికారం, పద్ధతులు, నియమనిబంధనల కన్నా, ఆప్యాయతది పైచెయ్యిగా ఉండేది. వెరసి జీవితంలో జీవం ఉండేది.
ఈనాడు అవన్నీ పలచబడిపోయాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్నది. వేరే ప్రపంచం. ఎవరికీ దేనికీ ఖాళీ లేదు. ఓపిక లేదు. స్తిమితంగా తినరు. | సుఖంగా సంసారం కూడా చెయ్యరు. వాళ్ళది కాని వేరే బతుకే చాలామంది బతుకుతున్నారు. యవ్వనంలో ఉన్న ఆడ, మగ మధ్య అవసరమే తప్ప, ఆకర్షణ కరువవుతున్న దౌర్భాగ్యదశ.
ఆ రోజుల్లో దుఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం. ఒకరి దుఖం పది మందికి తెలిస్తే, జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం. ఇప్పుడు దుఖాన్ని కాదు, సుఖాన్ని, సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఆమె………….
Reviews
There are no reviews yet.