Maha Swetha Devi

Brand :
350.00

చోళీకే పీచే

అనువాదం: కలేకూరి ప్రసాద్

‘అక్కడేముంది?’ అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, భూకంపాలు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులకీ, ప్రభుత్వ యంత్రాంగానికీ మధ్య ఘర్షణలు – ఫలితంగా మరణాలు; కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం; నర్మదా డామ్ విషయమై మేథా పాట్కర్ తదితరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్లు. వందలాదిగా జరుగుతున్న మానభంగాలు – హత్యలు – లాకప్లో చిత్రహింసలు వగైరా… వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానాలై పోయాయి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం… చోళీకే పీఛే – రవికె మాటున….

జాతీయ జీవనంలో ప్రాధాన్యం లేని అంశాలను ప్రాధాన్యం గల అంశాలు అణచి పారేస్తాయి – అదే నియమం. అందుకనే అక్కడ.. రవికె మాటున ఏముంది? అన్నది అతి ముఖ్యమైన సమస్య అయిపోయింది. భారతజాతి ‘ఆత్మ’పెనునిద్దురలో మునిగిపోవడమే కాక అవసరమైనప్పుడు మేల్కొనగలదనడానికి ఇదే తార్కాణం.

ఈ విధంగా యావన్మంది ప్రజానీకమూ అక్కడేముందో తెలుసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. జాతీయ ప్రసార సాధనాలు, సెన్సార్ బోర్డు, బ్రా వ్యతిరేక విముక్త మహిళలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేబుల్ టీవీ ఛానెల్స్ – కళ్ళమీద ఆకుపచ్చ షేడ్ వేసుకున్న మహిళా ఓటేరియన్ల సంస్థలు, అన్ని మతవర్గాలూ, ఇంకా రాజకీయ నాయకులు చాటుమాటుగా ‘ఖల్నాయక్ ‘ కాసెట్లు వేసుకుని చూడటం పరిపాటయిపోయింది……………..

In stock

Format

Paperback

Deliveried

4 – 9 DAYS

Author

Kalekuri Prasad